టాలీవుడ్ స్టార్ హీరోలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ అలానే మెగాస్టార్ చిరంజీవి రానున్న 2026 సంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద తలపడనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ న్యూస్. వివరాల్లోకి వెళితే ఇటీవల దేవర పార్ట్ 1 మూవీతో పెద్ద విజయం అందుకున్న ఎన్టీఆర్ ప్రస్తుతం హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 మూవీ చేస్తున్నారు.
మరోవైపు తాజాగా నీల్ తో చేయనున్న మూవీని ఆయన ప్రారంభించారు. నిన్న గ్రాండ్ గా ఈ మూవీ యొక్క షూటింగ్ హైదరాబాదు లోని రామోజీ ఫిలిం సిటీలో ప్రారంభమైంది. ఈ మూవీని వచ్చేఏడాది సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ యొక్క రిలీజ్ మరికొంత ఆలస్యం అయి 2026 సమ్మర్ కు వాయిదా పడుతుందని ఇటీవల వార్తలు వచ్చాయి.
కాగా లేటెస్ట్ అప్డేట్ ప్రకారం పక్కాగా దీనిని 2026 సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ఫిక్స్ అయ్యాయట. మరోవైపు చిరంజీవి తాజాగా మల్లిడి వశిష్టతో విశ్వంభర మూవీ చేస్తున్నారు. ఈ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే దీని అనంతరం ఇప్పటికే అనిల్ రావిపూడి తో ఒక మూవీ చేయడానికి సిద్ధమయ్యారు చిరంజీవి.
సాహు గారపాటి నిర్మించనున్న ఈ మూవీ త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా దీనిని పక్కాగా 2026 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. దానితో అటు ఎన్టీఆర్ నీల్ మూవీ, ఇటు చిరంజీవి అనిల్ రావిపూడి మూవీ పక్కాగా 2026 సంక్రాంతికి క్లాష్ అవ్వటం ఖాయమని తెలుస్తోంది. మరి ఈ రెండు క్రేజీ మూవీస్ ఏ స్థాయి విజయాలు అందుకుంటాయో తెలియాలి అంటే మరొక ఎనిమిది నెలల వరకు వెయిట్ చేయాలి.