HomeChhaava Telugu Trailer Release Date Time Fixed 'ఛావా' తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్,...
Array

Chhaava Telugu Trailer Release Date Time Fixed ‘ఛావా’ తెలుగు ట్రైలర్ రిలీజ్ డేట్, టైం ఫిక్స్ 

- Advertisement -

బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ హిస్టారికల్ భారీ యాక్షన్ ఎమోషనల్ డ్రామా మూవీ ఛావా. ఇటీవల బాలీవుడ్ లో మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఛావా మూవీ పేద బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతూ దూసుకెళుతోంది. 

ఇప్పటికే హిందీలో రూ. 400 కోట్ల క్లబ్ లో చేరిన ఛావా మూవీలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడిగా ఛత్రపతి శంభాజీ మహారాజ్ గా పవర్ఫుల్ పాత్రలో తన అద్భుత నటనతో అందరినీ ఆకట్టుకున్నారు విక్కీ కౌశల్. 

అలానే ఆయన భార్య యేసు భాయి భోంస్లే గా రష్మిక మందన్న, ఔరంగజేబు గా అక్షయ్ ఖన్నా ల నటన కూడా అందరినీ అలరిస్తోంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో ప్రస్తుతం ఆకట్టుకుంటున్న ఛావా మూవీ మార్చి 7న గ్రాండ్ గా తెలుగు ఆడియన్స్ ముందుకి రానుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు వేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క తెలుగు ట్రైలర్ ని మార్చి 3న ఉదయం 10 గంటలకు రిలీజ్ చేయనున్నారు. 

మరోవైపు ఈ మూవీని ఇతర పాన్ ఇండియన్ భాషల్లో కూడా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. మ్యాడాక్ ఫిలిమ్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మించిన ఈ మూవీకి ఏ ఆర్ రహమాన్ సంగీతం సమకూర్చారు. కాగా తెలుగులో ఈ మూవీని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూటర్స్ వారు గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories