చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడైన చత్రపతి శంభాజీ మహారాజ్ కథగా తాజాగా తెరకెక్కిన మూవీ ఛావా. శివాజీ మహారాజ్ మరణానంతరం ఔరంగజేబు ఆయన రాజ్యంపై దాడి చేయడం దానిని శంభాజీ మహారాజ్ ప్రతిఘటించే అంశం ఆధారంగా తాజాగా ఛావా మూవీ రూపొందింది.
ఫిబ్రవరి 14న భారీ అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ అందర్నీ ఆకట్టుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళ్తోంది. ఇక ఈ మూవీలో శంభాజీ మహారాజుగా విక్కీ కౌశల్ కనిపించగా ఆయన భార్య యేసు భాయి భోంస్లే గా నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించారు.
ఈ మూవీ ప్రస్తుతం థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ స్పందన అందుకుంటూ కొనసాగుతుండగా ఈ సినిమా యొక్క ఓటిటి రిలీజ్ కి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా యొక్క ఓటిటి హక్కులను సొంతం చేసుకుంది. అందుతున్న సమాచారాన్ని బట్టి ఏప్రిల్ రెండవ వారంలో ఈ మూవీ ఓటిటి ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది.
అయితే హిందీలో తెరకెక్కిన ఈ మూవీ తెలుగు సహా ఇతర పాన్ ఇండియన్ భాషల్లో ఓటిటిలో అందుబాటులో ఉంటుందో లేదో చూడాలి. గ్రాండ్ విజువల్స్ తో అత్యున్నత స్థాయి టెక్నికల్ వాల్యూస్ తో ఆకట్టుకునే కథ, కథనాలు, యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాలతో రూపొందిన ఛావా మూవీకి ఆడియన్స్ అందరి నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది. ముఖ్యంగా శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ నటనకు అందరూ ప్రసంశలు కురిపిస్తున్నారు.