బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా మ్యాడాక్ ఫిలిమ్స్ సంస్థ పై తెరకెక్కిన లేటెస్ట్ హిస్టారికల్ యాక్షన్ మూవీ ఛావా. ఈ మూవీలో అక్షయ్ ఖన్నా, అశుతోష్ రానా, డయానా పేంటీ, దివ్య దత్తా తదితరులు కీలక పాత్రల్లో కనిపించగా లక్ష్మణ్ ఉటేకర్ దీనిని తెరకెక్కించారు.
ఫిబ్రవరి 14న గ్రాండ్ గా బాలీవుడ్ లో భారీ స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్ తో కొనసాగుతోంది. దర్శకుడు లక్ష్మణ్ ఆకట్టుకునే టేకింగ్ తో పాటు ఛత్రపతి శంభాజీ మహారాజ్ గా విక్కీ కౌశల్ అద్భుత పెర్ఫార్మన్స్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
తాజాగా నిన్నటితో 9వ రోజుకు అడుగుపెట్టిన ఈ మూవీ అక్కడ రూ. 40 కోట్ల నెట్ కలెక్షన్ సొంతం చేసుకుని ఏ హిందీ మూవీ కూడా అందుకోని రికార్డుని నెలకొల్పింది. నేటితో ఈ మూవీ రూ. 300 కోట్ల క్లబ్ లో జాయిన్ అవ్వనుంది.
అలానే ఈ మూవీ ప్రస్తుత కలెక్షన్స్ ని బట్టి చూస్తుంటే ఇది ఇండియా లో రూ. 500 కోట్ల మార్క్ వరకు చేరుకునే అవకాశం గట్టింగా కనపడుతోందని అంటున్నారు సినీ అనలిస్టులు. మొత్తంగా ఛావా ఎంతమేర ఓవరాల్ వరల్డ్ వైడ్ కలెక్షన్ అందుకుంటుందో తెలియాలి అంటే మరికొన్నాళ్ల వరకు ఆగాల్సిందే.