టాలీవుడ్ యువ నటుల్లో ఒకరైన రాజ్ తరుణ్ తొలిసారిగా ఉయ్యాలా జంపాల మూవీ ద్వారా టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీ తోనే మంచి విజయం అందుకున్నారు. ఆ తరువాత నుండి ఒక్కొక్కటిగా సినిమాలతో విజయాలను, మంచి క్రేజ్ ని పేరుని సొంతం చేసుకుని కొనసాగుతున్న రాజ్ తరుణ్ ప్రస్తుతం తిరగబడరా సామి అనే మూవీ చేస్తున్నారు.
త్వరలో ఇది ఆడియన్స్ ముందుకి రానుంది. అయితే అసలు విషయం ఏమిటంటే, తాజాగా రాజ్ తరుణ్ పై లావణ్య అనే యువతీ చీటింగ్ కేసు నమోదు చేసింది. ప్రస్తుతం టాలీవుడ్ లో వైరల్ అవుతున్న ఈ న్యూస్ వివరాల్లోకి వెళితే, తనతో 11 ఏళ్లుగా రిలేషన్ లో కొనసాగుతున్న రాజ్ తరుణ్ తనని మోసం చేసాడని లావణ్య నేడు హైదరాబాద్ నార్సంగి పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ చేసింది.
తనతో అఫైర్ పెట్టుకోవడంతో పాటు ఇటీవల తనను రహస్యంగా పెళ్లి కూడా చేసుకున్నాడని అంటోంది. తనపై అన్యాయంగా డ్రగ్స్ కేసు బరాయించి 45 రోజులు జైల్లో ఉంచారని, ఇక మూడు నెలల నుండి రాజ్ తరుణ్ కి తాను దూరంగా ఉన్నట్లు తన కంప్లైట్ లో పేర్కొంది. ఇక తాజాగా రాజ్ తరుణ్ హీరోగా తెరకెక్కుతున్న తిరగబడరా సామీ మూవీలో హీరోయిన్ గా నటిస్తున్న మాల్వి మల్హోత్రా, ఆమె సోదరుడు మయాంక్ ఈ ఫిర్యాదుకు కారణం అని, వారిద్దరూ తనని రాజ్ తరుణ్ ని వదిలేయమని బెదిరింపులకు పాల్పడుతున్నట్లు తెలిపింది లావణ్య. మాల్వి తో రాజ్ తరుణ్ రిలేషన్ లో ఉన్నాడని, అదేంటి అని అతడిని నిలదీస్తే దుర్భాషలాడాడని తెలిపింది. రాజ్ తరుణ్ జీవితం నుండి వెళ్లిపోయేందుకు వారిద్దరూ తనకు డబ్బు ఆశ చూపించారని, అలానే ఆపై చంపుతాం అని బెదిరించినట్లు కూడా లావణ్య చెపుతోంది.
అయితే ఈ విషయమై తాజాగా ఒక మీడియా ఛానల్ ద్వారా రాజ్ తరుణ్ స్పందిస్తూ, నిజానికి లావణ్య నేను ఇటీవల మూడేళ్ళ పాటు రిలేషన్ లో కొనసాగామని, అయితే ఇద్దరికీ మధ్య ఎటువంటి ప్రత్యేక సంబంధం లేదన్నారు. ఇక మధ్యలో లావణ్య తన స్నేహితులతో కలిసి డ్రగ్స్ తీసుకోవడం చూసి తట్టుకోలేక వదిలేద్దాం అనుకున్నానన్నారు. అలా చేస్తే మీడియా ముందుకి వెళ్తాను అంటూ లావణ్య బెదిరించడంతో పాటు మరొక వ్యక్తితో ఆమె రిలేషన్ పెట్టుకుందన్నారు.
ఆపైన లావణ్య పై డ్రగ్స్ కేసు నమోదవడంతో దానికి నేను కారణం అంటూ లేనిపోని నిందలు వేసిందన్నారు. ఆమె తన తండ్రిని సైతం బ్లాక్ మెయిల్ చేసింది. నిజానికి మా ఇద్దరికీ పెళ్లి కాలేదు, అసలు నేను పెళ్లి చేసుకోకూడదు అనే నిర్ణయం తీసుకున్న విషయం ఇండస్ట్రీలో అనేకమందికి తెలుసన్నారు రాజ్ తరుణ్. మరి ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ కేసు రాబోయే రోజుల్లో ఎన్ని మలుపు తిరుగుతుందో, ఫైనల్ గా ఏమి జరుగుతుందో చూడాలి.