Homeసినిమా వార్తలుకాంచన చంద్రముఖి ని మరిపిస్తుందా?

కాంచన చంద్రముఖి ని మరిపిస్తుందా?

- Advertisement -

2005 లో విడుదలైన చంద్రముఖి సినిమా ఎంత పెద్ద హిట్ అనేది తెలిసిన విషయమే. బాబా లాంటి డిజాస్టర్ తరువాత రజినీకాంత్ స్టార్ డం మీద ప్రశలు వేసిన అందరి నోళ్ళు మూసుకునేలా చేసిందీ ఆ సినిమా.

ఆ తరువాత 2010లో తెలుగులో నాగవల్లి అంటూ విక్టరీ వెంకటేష్ దానికి సీక్వెల్ తీశారు. అయితే అది కేవలం రీబూట్ వెర్షన్ యే తప్ప మొదటి భాగానికి కొనసాగింపు ఏమీ ఉండదు. అందునా తమిళ భాషలో రిలీజ్ కూడా చేయలేదు.

అందువల్ల అప్పుడప్పుడు చంద్రముఖి సీక్వెల్ కి సంబంధించిన వార్తలు వస్తూ ఉండేవి కానీ అధికారికంగా ప్రకటన ఏదీ రాలేదు. ఎట్టకేలకు ఇన్ని సంవత్సరాల తరువాత చంద్రముఖి 2 సీక్వెల్ అనౌన్స్ చేయడం జరిగింది.

తొలి భాగానికి దర్శకత్వం వహించిన పీ వాసు గారే ఈ సీక్వెల్ తీసే బాధ్యతను తీసుకున్నారు. ఇందులో లారెన్స్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, ముఖ్య పాత్రలో వడివేలు కనిపించనున్నారు. ఇతర తారాగణం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.అలాగే ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ తోట తరణ గారూ ఈ సినిమాకి పని చేయడం విశేషం.

చంద్రముఖిలో కేవలం రజినీ పాత్ర మాత్రమే కాకుండా జ్యోతికకు ప్రాధాన్యం ఉండింది. అలాగే సహాయ పాత్రల్లో ప్రభు, నాజర్, నయనతార,అవినాష్ వంటి వారు తమ ఉనికిని చాటుకున్నారు. ఇక వడివేలు కామెడీ ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించింది.

READ  ప్రేక్షకుల నుండి నాని దూరం అవుతున్నాడా?

ఇక లారెన్స్ కి హారర్ కి ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక రకంగా హారర్ సినిమాల ట్రెండ్ ను పెంచి పోషించింది లారెన్స్ అనే చెప్పాలి.తనే హీరోగా నటించి దర్శకత్వం వహించిన కాంచన/ముని సీరీస్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ సీరీస్ లో ఇంతవరకు ప్లాప్ అయిన సినిమానే లేదు అంటేనే లారెన్స్ యే రేంజ్ లో ఆడియన్స్ పల్స్ పట్టాడు అనేది అర్థం అవుతుంది.

మరి లారెన్స్ తనదైన శైలిలో హారర్ కామెడీ దట్టించి తన బలం చూపిస్తాడో, లేక పీ వాసు తన అనుభవం అంతా రంగరించి లారెన్స్ ను డామినేట్ చేస్తాడా అనేది వేచి చూడాలి. ఇద్దరిలో ఎవరు గెలిచినా ఆడియన్స్ కు మాత్రం ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనడంలో ఎలాంటి సందేహం లేదు.

Follow on Google News Follow on Whatsapp

READ  ఖైదీ 2 లో అలరించనున్న ఢిల్లీ కబడ్డీ


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories