జూన్ 17 న రిలీజ్ కి సిద్ధమైన విరాట పర్వం సినిమా సెన్సార్ కార్యక్రమం పూర్తి చేసుకుంది.
పీరియాడిక్ డ్రామా గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పోలీస్ లకీ నక్సలైట్ ల మధ్య పోరాటాలు, భావోద్వేగ సన్నివేశాలు ఉండబోతున్నాయి అని ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది.
కాగా సెన్సార్ బోర్డ్ విరాట పర్వం సినిమా విషయంలో బాగానే కత్తెరకు పని చెప్పినట్టు తెలుస్తుంది. బూతులు ఉన్న చాలా సన్నివేశాలకు డైలాగ్ లు మార్చివేయబడటం జరిగింది.
అలాగే నక్సల్ బ్యాక్ డ్రాప్ అవ్వడం మూలాన అసాంఘిక కార్యకలాపాలకి వ్యతిరేకంగా డిస్క్లేయిమర్ కూడా వేయించినట్టు తెలుస్తుంది.