Home సినిమా వార్తలు Ceeded Area becomes JrNtr Adda సీడెడ్ గడ్డ ఎన్టీఆర్ అడ్డా

Ceeded Area becomes JrNtr Adda సీడెడ్ గడ్డ ఎన్టీఆర్ అడ్డా

devara movie

టాలీవుడ్ స్టార్ యాక్టర్స్ లో ఒకరైన యంగ్ టైగర్ గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ దేవర పార్ట్ 1. ఈ మూవీని యువ సుధా ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు గ్రాండ్ లెవెల్లో భారీ వ్యయంతో నిర్మించగా అనిరుద్ సంగీతం అందించారు. 

జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 27న భారీ స్థాయిలో అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద సక్సెస్ దిశగా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ డ్యుయల్ రోల్ లో అద్భుతంగా పెర్ఫర్మ్ చేసిన దేవర పార్ట్ 1 మూవీకి ఎన్టీఆర్ ఫ్యాన్ తో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఆదరణ అందిస్తున్నారు. విషయం ఏమిటంటే, సీడెడ్ లో ఎన్టీఆర్ కి మాస్ క్రేజ్ ఎంతో ఎక్కువనేది తెలిసిందే. 

ఆ ఏరియాలో ఇప్పటికే దేవర ఓపెనింగ్స్ పరంగా అదరగొట్టగా తాజాగా పదవ రోజున ఈ మూవీ రూ. 1 కోటి కొల్లగొట్టడం విశేషం. మరోవైపు ఆర్ఆర్ఆర్, బాహుబలి 2 తరువాత ఇప్పటివరకు రూ. 22 కోట్లు గ్రాస్ కొల్లగొట్టి అక్కడ మూడవ స్థానంలో నిలిచింది దేవర పార్ట్ 1. ఇక ఈ వారంలో ఈ మూవీ రూ. 25 కోట్ల గ్రాస్ మార్క్ చేరుకునే అవకాశం ఉందని అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు. దేవర పార్ట్ 1 తెలుగు వర్షన్ వరల్డ్ వైడ్ ఇప్పటికే రూ. 165 కోట్లు రాబట్టగా ప్రస్తుతం దసరా సెలవలు కావడంతో రూ. 200 కోట్లు చేరుకుంటుందో లేదో చూడాలి. 

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version