మైత్రి మూవీ మేకర్స్, శ్రేయాస్ మీడియా గ్రూప్ ల పై కేసు నమోదు అయింది. హైదరాబాద్ లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.జూన్ 9న శిల్ప కళా వేదిక పై “అంటే సుందరానికీ” ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే.
ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.అందువల్ల ఆయన అశేష అభిమానులు కూడా ఆ ఈవెంట్ కు తరలి వచ్చారు.
అయితే, మైత్రి మూవీ మేకర్స్ మరియు షో హోస్ట్ అయినా శ్రేయాస్ మీడియా ఎక్కడా కరోనా నిభందనలు పాటించలేదు అని ఒక వ్యక్తి మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు.సైబరాబాద్ పోలీస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర నుండి నిర్వాహకులకు ఎలాంటి అనుమతి లభించలేదని పోలీసులు తెలిపారు.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే జూన్ 10న, అంటే ఈవెంట్ జరిగిన మరుసటి రోజున దరఖాస్తు కమిషననర్ టేబుల్ వద్దకు చేరింది. ఇలాంటి ఈవెంట్ లు ఏర్పాటు చేస్తున్నపుడు ఆయా దరఖాస్తుదారులే పెర్మిషన్ లెటర్ వంటివి జాగ్రత్తగా పరిశీలించి భాద్యతగా వ్యవహరించాలి అని అధికారులు పేర్కొన్నారు.