టాలీవుడ్ స్టార్ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్టైనర్ మూవీ పుష్ప 2 ది రూల్. ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి మంచి విజయం అందుకున్న పుష్ప ది రైజ్ కి ఇది సీక్వెల్ అనేది తెలిసిందే.
ఇక ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా కీలక పాత్రల్లో అనసూయ, ఫహాద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, రావు రమేష్ తదితరులు నటిస్తున్నారు. మొదటి నుండి అందరిలో విశేషమైన క్రేజ్ కలిగిన పుష్ప మూవీని ప్రముఖ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. విషయం ఏమిటంటే, ఇటీవల అల్లు అర్జున్ కి మెగా ఫ్యామిలీ కి మధ్య సోషల్ మీడియాలో కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో కొందరు మెగా ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ పుష్ప 2 మూవీకి తాము సపోర్ట్ చేయమని అంటుంటే మరికొందరు ఏకంగా ఆ మూవీని డ్యామేజ్ చేస్తాం అంటూ నెగటివ్ గా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే అల్లు అర్జున్ రెండు తెలుగు రాష్ట్రాలు సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎంతో గొప్ప క్రేజ్ సొంతం చేసుకున్నారని, ఇక పుష్ప 2 మూవీలో మంచి కంటెంట్ ఉంటే ఎవరూ కూడా దానిని టచ్ చేయలేరని పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.