Homeసినిమా వార్తలుహిట్టు కోసం గోపీచంద్ - శ్రీను వైట్ల ప్రయత్నం ఫలిస్తుందా?

హిట్టు కోసం గోపీచంద్ – శ్రీను వైట్ల ప్రయత్నం ఫలిస్తుందా?

- Advertisement -

గత కొన్నేళ్లుగా సరైన విజయం లేక కెరీర్లో బాగా వెనుక పడ్డ దర్శకులలో శ్రీనువైట్ల ఒకరు. ఒకప్పుడు కామెడీ ఎంటర్టైనర్ సినిమాలను తనదైన శైలిలో తెరకెక్కించి వరుస విజయాలను సొంతం చేసుకున్న ఈ దర్శకుడికి ప్రస్తుతం అవకాశం దొరకాలంటేనే చాలా కష్టంగా ఉంది. ఆయనతో సినిమా చేయాలి అంటేనే నిర్మాతలు టెన్షన్ పడుతున్నారు.

సీనియర్ హీరోలు, వర్ధమాన హీరోలు ఇలా ఎవరైనా ఏ స్థాయి హీరోలైనా, శ్రీనువైట్లకు ఛాన్స్ ఇవ్వడానికి అస్సలు ఆసక్తి చూపడం లేదు. ఆగడు, బ్రూస్ లీ, మిస్టర్, అమర్ అక్బర్ ఆంటోనీ.. ఇలా వరుసగా ఒకటి దానికి మించి మరొకటి డిజాస్టర్లుగా నిలిచాయి. ఈ సినిమాలను నిర్మించిన నిర్మాతలకు భారీ మొత్తంలో నష్టాలు వాటిల్లాయి.

కెరీర్ మొదట్లో విలన్ ఇంట్లో హీరో కామెడీ చేసే ఫార్ములాతో సినిమాలు చేసి వరుస విజయాలను సొంతం చేసుకున్నారు శ్రీను వైట్ల. అప్పట్లో ఆయన సినిమా అంటే ఇంటిల్లిపాదీ చూడదగ్గ సినిమా అనే టాక్ ఉండేది. 2011 లో వచ్చిన దూకుడు చిత్రంతో ఆయన భారీ బ్లాక్ బస్టర్ అందించారు. ఆ దశలో ఆయన అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయినట్లు అంతా భావించారు.

READ  మరో భారీ సినిమాని చేజిక్కుంచుకున్న అనిరుధ్

ఆ తర్వాత ఎన్టీఆర్ తో బాద్షా కూడా సూపర్ హిట్ అయింది. అయితే దూకుడు హిట్ కాంబో రిపీట్ చెద్దామని మహేష్ తో ఆగడు సినిమా తీయగా.. అనూహ్యంగా ఆ చిత్రం భారీ పరాజయం పాలయింది. అప్పటి నుంచి శ్రీను వైట్లకు కష్టకాలం మొదలయింది. తనతో కలిసి పని చేసిన రచయితలు కోన వెంకట్, గోపి మోహన్ తో అభిప్రాయ భేదాలు రావడం, అలాగే వ్యక్తిగత జీవితంలోని సమస్యలు కూడా ఆయన కెరీర్ డౌన్ ఫాల్ కు కారణమని కొంతమంది భావిస్తారు.

అయితే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం.. ఈ దర్శకుడితో సినిమా చేయడానికి గోపీచంద్ సరే అన్నట్లు తెలుస్తోంది. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ చిత్రంతో ఒకప్పుడు హిట్ టీమ్ గా పేరు తెచ్చుకున్న శ్రీను వైట్ల, కోన వెంకట్, గోపీ మోహన్ మళ్ళీ ఈ సినిమాకి కలిసి పని చేయబోతున్నారట. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాకి నిర్మాత, ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల తాలూకు వివరాలు తొందర్లోనే తెలుస్తాయి.

కాగా మంచు విష్ణు – శ్రీనువైట్ల కాంబినేషన్ లో ఢీ సినిమా సీక్వెల్ అప్పట్లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆ సినిమా గురించి ఎటువంటి సమాచారం రాలేదు. ఈ సినిమా ఉంటుందో లేదో ఇంకా స్పష్టత రాలేదు. గోపీచంద్ చివరి సినిమా అయిన పక్కా కమర్షియల్ కూడా అట్టర్ ఫ్లాప్ గా నిలిచింది. అటు హీరో, ఇటు దర్శకుడు ఇద్దరికీ తప్పక హిట్ కొట్టాల్సిన పరిస్థితిలో వారి కలయికలో వస్తున్న సినిమా విజయం సాధించాలని కోరుకుందాం.

Follow on Google News Follow on Whatsapp

READ  లైగర్ సినిమాపై తప్పుడు ప్రచారం చేశారు - వరంగల్ శ్రీను


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories