Homeసినిమా వార్తలుపవన్ - మహేష్ రికార్డులను ప్రభాస్ దాటగలడా?

పవన్ – మహేష్ రికార్డులను ప్రభాస్ దాటగలడా?

- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు పోకిరి చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించి భారీ స్థాయిలో సంబరాలు చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే మహేష్ అభిమానులు పోకిరి స్పెషల్ షోల ప్రదర్శన జరిపించిన తీరు ఇతర అభిమానులకి ఒక సవాల్ గా నిలిచింది. వారి స్థాయిలో వేరే హీరో అభిమానులు తమ బలాన్ని చుపగలరా లేరా అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తం అయ్యాయి. పోకిరి చిత్ర ప్రత్యేక ప్రదర్శనల తో మహేష్ అభిమానులు రికార్డు సృష్టించారు. పోకిరి చిత్రం స్పెషల్ షోలతో మొత్తంగా 2 కోట్లకు పైగా గ్రాస్‌ను వసూలు చేసింది. అంతే కాకుండా 375 షోలకు పైగా ప్రదర్శించబడింది.

మహేష్ బాబు అభిమానులు తమ హీరో స్టార్‌డమ్‌ను ఆ స్థాయిలో ప్రదర్శించిన తర్వాత, పవన్ కళ్యాణ్ అభిమానులు ఆ సవాల్ ను స్వీకరించి రికార్డులను బ్రేక్ చేయడానికి నిర్ణయించుకున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా, ఆయన అభిమానులు బ్లాక్ బస్టర్ చిత్రం జల్సాని రీ-రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసారు. ఇక జల్సా సినిమా స్పెషల్ షోల బుకింగ్స్ తో పాటు జల్సా స్పెషల్ షోల సంఖ్య కూడా పోకిరిని సులభంగా దాటేసేలా ఉన్నాయి.500 షోలకు పైగానే జల్సా సినిమా ప్రత్యేక ప్రదర్శనలు జరుగుతాయని అంచనా.

అయితే కథ ఇక్కడే ఆగిపోలేదు, మహేష్, పవన్ అభిమానుల తరువాత ఇప్పుడు ప్రభాస్ అభిమానులు కూడా ఈ ట్రెండ్ ను కొనసాగించనున్నారు. అక్టోబర్ 23న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా బిల్లా సినిమా స్పెషల్ షోలతో తమ బలాన్ని చూపించడానికి ప్రభాస్ అభిమానులు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారట. ఈ మేరకు యంగ్ రెబల్ స్టార్ పుట్టినరోజు సందర్భంగా, బిల్లా సినిమా 4K ప్రింట్ వెర్షన్‌ను అన్ని ప్రాంతాలలో భారీ స్థాయిలో రీ-రిలీజ్ చేయడానికి అభిమానులు సన్నాహాలు చేస్తున్నారు.

READ  Box-Office: బ్లాక్ బస్టర్ సాధించిన దనుష్

అయితే ఇప్పుడు అందరిలోనూ ఉన్న ప్రశ్న ఏమిటంటే, మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ సాధించిన రికార్డులను ప్రభాస్ బ్రేక్ చేయగలడా లేదా అన్నదే ఆ ప్రశ్న. ఇదిలా ఉండగా ప్రభాస్ నటించిన అన్ని సినిమాల్లో.. అభిమానులు బిల్లా సినిమాను ఎంచుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. బిల్లా సినిమా తమిళ చిత్రం బిల్లాకి రీమేక్, తెలుగు రీమేక్ పరవాలేదు అనిపించింది తప్ప భారీ హిట్ ఏమీ కాదు. ప్రభాస్ కెరీర్ లో మాస్ అంశాలు నిండుగా కలిగినా ఛత్రపతి లేదా మిర్చి వంటి మంచి మాస్ ఎంటర్‌టైనర్‌లను స్పెషల్ షోల కోసం తీసుకుని ఉంటే బాగుండేది అని పలువురు సినీ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.

Follow on Google News Follow on Whatsapp

READ  నేనున్నాను నిఖిల్ అంటున్న మంచు విష్ణు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories