Homeసినిమా వార్తలురిలీజ్ ట్రైలర్లతో ఆకట్టుకున్న రవితేజ - కల్యాణ్ రామ్

రిలీజ్ ట్రైలర్లతో ఆకట్టుకున్న రవితేజ – కల్యాణ్ రామ్

- Advertisement -

మాస్ మహారాజా రవితేజ, నందమూరి కళ్యాణ్ రామ్ ఇద్దరూ తమ తాజా చిత్రాలను రిలీజ్ కు సిద్ధం చేశారు. ఇక ఇద్దరి సినిమాల చిత్ర యూనిట్లు కూడా తమ సినిమా ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేశాయి. ఇటివలే రామారావు ఆన్ డ్యూటీ చిత్ర ప్రి రిలీజ్ ఈవెంట్ ను జేఆర్సీ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఇక కళ్యాణ్ రామ్ నటిస్తున్న “బింబిసార”చిత్రం తాలూకు ప్రి రిలీజ్ ఈవెంట్ ఈ శుక్రవారం అంటే జూలై 29న నిర్వహిస్తున్నారు.

ఇక ఈ రెండు చిత్రాలలో రామారావు ఆన్ డ్యూటీ ముందుగా ఈ నెల 29 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. శరత్ మాండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ర‌వితేజ ఎం.ఆర్‌.ఓ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.ఓ సిన్సియ‌ర్ గ‌వ‌ర్న‌మెంట్ ఆఫీస‌ర్ అవినీతి రాజ‌కీయ నాయ‌కులని, ప్రతికూల పరిస్తితులని ఎలా ఎదుర్కున్నాడు అనేదే సినిమా కథ. ఇందులో ర‌జిషా విజ‌య‌న్‌, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లు గా నటించారు.

ఇప్పటికే ఈ చిత్ర పలు సాంగ్స్, ట్రైలర్ లకు చక్కని స్పందన లభించగా, ఈరోజు ఈ చిత్రం యొక్క రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేసారు.

READ  అలాంటిి పాత్రల పై ఎక్కువ శ్రద్ధ వహిస్తున్న సాయి పల్లవి

ఇక ఈ రిలీజ్ ట్రైలర్ ను చూస్తూంటే సినిమా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందినట్టు తెలుస్తుంది. నేపథ్య సంగీతం మరియు ఛాయాగ్రహణం అద్భుతంగా ఉండగా.. “మీ ఆయన మెరుపు లాంటి వాడు.. శబ్దం లేకుండా వెలుగునిచ్చే రకం.. నేను లక్కుల మీద లాటరీల మీద డిపెండ్ అయ్యేవాడిని కాదు.. నా వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని” అంటూ సాగే డైలాగులు ఆకట్టుకునేలా ఉన్నాయి.

ఇక కళ్యాణ్ రామ్ నటించిన “బింబిసార”సినిమాను ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్టు ఇది వరకే ప్రకటించారు. ప్యాన్ ఇండియా స్థాయిలో విడుదలవుతోన్న ఈ సినిమాలో హీరోయిన్లుగా క్యాథరిన్, సంయుక్త మీనన్ నటించారు. చారిత్రాత్మక నేపథ్యానికి సైన్స్ ఫిక్షన్ అంశాన్ని మిళితం చేసి ఒక ఆసక్తికరమైన కథాంశంతో వస్తున్న ఈ సినిమాకు కీరవాణితో పాటు చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు. వశిష్ట్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.బింబిసార చిత్ర యూనిట్ కూడా తమ చిత్రం యొక్క రిలీజ్ ట్రైలర్ ను ఈరోజు విడుదల చేశారు. ఆ ట్రెయిలర్ లో కళ్యాణ్ రామ్ ” మన రాజ్యపు సరిహద్దులు చెరిపేసి ఆ పై రాజ్యాలను దాటి విస్తరించాలి. శరణు కోరితే ప్రాణ భిక్ష… ఎదిరిస్తే మరణం.. నాడైనా.. నేడైనా త్రిగర్తల చరిత్రను తాకాలంటే.. బింబిసారుడి కత్తిని దాటాలి” అంటూ వీరోచిత డైలాగులు పలికారు కళ్యాణ్ రామ్, దానికి తోడు అద్భుతమైన నేపథ్య సంగీతం తోడయి సినిమాపై అంచనాలు పెంచేశాయి అని చెప్పవచ్చు.

READ  New Trend in Tollywood: టికెట్ రేట్లు తక్కువ చేసిన థాంక్యూ టీమ్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories