ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 మూవీ తో అతి పెద్ద పాన్ ఇండియన్ సక్సెస్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దీని అనంతరం ఇప్పటికే త్రివిక్రమ్ తో ఒక మూవీ అలానే అట్లీతో మరొక మూవీ లైన్లో పెట్టారు అల్లు అర్జున్.
ఇటీవల త్రివిక్రమ్ మూవీ యొక్క అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. హారికా హాసిని క్రియేషన్స్ ఆ మూవీ ని నిర్మించనున్నాయి. ఇక త్వరలో అట్లీ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేయనున్న సినిమా కూడా ప్రారంభం కానుంది. ఈ క్రేజీ కాంబో సినిమా పై అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.
అయితే ఏప్రిల్ 8న అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా అట్లీ మూవీకి సంబంధించి అనౌన్స్ మెంట్ తో కూడిన ఒక ఇంట్రడక్షన్ గ్లింప్స్ ఇవ్వాలని భావించారట టీమ్. ఇప్పటికే ఆ మూవీలో తన పాత్ర కోసం అల్లు అర్జున్ మేకోవర్ పరంగా సిద్ధమవుతున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్న ఈ మూవీలో తొలిసారిగా అల్లు అర్జున్ డ్యూయల్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది.
యువ సంగీత దర్శకుడు అభ్యంకర్ సంగీతం సమకూర్చనున్న ఈ మూవీ వచ్చే ఏడాదిలో ఆడియన్స్ ముందుకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ మూవీ గురించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల పూర్తి వివరాలు అనౌన్స్ మెంట్ రోజుల వెల్లడి కానున్నాయట. మొత్తంగా అల్లు అర్జున్ బర్త్ డే నాడు ఆయన ఫ్యాన్స్ కి ఈ అనౌన్స్ మెంట్ పండుగ సంబరం కానుందట.