Homeసినిమా వార్తలుబాక్స్ ఆఫీస్ వద్ద నాలుగవ రోజు అనూహ్యంగా పడిపోయిన బ్రహ్మాస్త్ర

బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగవ రోజు అనూహ్యంగా పడిపోయిన బ్రహ్మాస్త్ర

- Advertisement -

గత కొంత కాలంగా బాలీవుడ్ కి సరైన హిట్టు పడలేదు. ముఖ్యంగా కరోనా తర్వాత ప్రేక్షకులని థియేటర్ల వద్దకు రప్పించడం వారికి తలకు మించిన భారంగా మారింది. అగ్ర హీరోల సినిమాలు కూడా బలమైన హిట్ కొట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే వచ్చిన అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా భారీ పరాజయం పొందిన విషయం తెలిసిందే. ఇక అక్షయ్ కుమార్ అయితే ఆయన నటించిన చివరి నాలుగు సినిమాలలో కేవలం ఒక్క సినిమానే హిట్టు కొట్టింది. ఇక ఈ ఏడాది భూల్ భులయ్య-2, ది కాశ్మీర్ ఫైల్స్ మాత్రమే భారీ విజయాలు సాధించాయి.

ఇక మన తెలుగు సినిమా ఆర్ ఆర్ ఆర్, కన్నడ చిత్రం కేజీఫ్-2 హిందీ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో బాలీవుడ్ దృష్టంతా ఓకే సినిమా పై పడింది. అదే గత వారం విడుదలైన బాలీవుడ్ ప్యాన్ ఇండియా సినిమా బ్రహ్మస్త్ర.

రణ్ బీర్ కపూర్ అలియా భట్ కలిసి నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘బ్రహ్మాస్త్ర’. మన భారతీయ పురాణాల ఆధారంగా ఈ సినిమాని అయాన్ ముఖర్జీ తెరకెక్కించారు. కరణ్ జోహార్, రణ్ బీర్ కపూర్, అయాన్ ముఖర్జీ తో కలిసి మరికొంత మంది ఈ చిత్రాన్ని నిర్మించారు. రిలీజ్ కు ముందు నుంచి భారీ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా.. నిజానికి ఫస్ట్ డే ఫస్ట్ షోకే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అలాగే నెగటివ్ రివ్యూలు కూడా వచ్చాయి. అయితే సినిమాపై వున్న బజ్ కారణంగా భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరగడంతో తొలి మూడు రోజులు భారీ స్థాయిలోనే ఈ సినిమా భారీ వసూళ్లని రాబట్టింది.

READ  బాలీవుడ్ ను కలవరపెడుతున్న బాయ్కాట్ ట్రెండ్

నిజానికి బాలీవుడ్ లో ఉన్న పరిస్థితిలో, అదీ తాజాగా బాగా ప్రబలుతున్న బాయ్కాట్ ట్రెండ్ నేపథ్యంలో బ్రహ్మస్త్ర ఓపెనింగ్స్ అయినా దక్కించుకుంటుందా అనే అనుమానం వ్యక్తం అయినా.. భారీ పబ్లిసిటీ వల్ల సినిమా తొలి మూడు రోజులు బాక్స్ ఆఫీస్ వద్ద నిలకడగా రాణించి ప్రపంచ వ్యాప్తంగా 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక సాధారణంగా అన్ని సినిమాలకు చూసినట్టే ఈ చిత్రానికి కూడా సోమవారం కలెక్షన్లు ఎలా ఉంటాయి అనే దాన్ని బట్టి సినిమా ఏ స్థాయిలో ఉంటుందో నిర్ణయం తీసుకుందాం అని ట్రేడ్ వర్గాలు భావించాయి.

ఇక అత్యంత కీలకమైన సోమవారం పరీక్షలో బ్రహ్మస్త్ర అత్తెసరు మార్కులు తెచ్చుకుంది. ఆదివారంతో పోలిస్తే సోమవారం కలెక్షన్లలో 60% కంటే ఎక్కువ డ్రాప్ వచ్చింది, ఇది ఎవరూ ఊహించనిది. మొత్తంగా నాలుగవ రోజు ఈ చిత్రం దేశ వ్యాప్తంగా 16.5 నెట్ వసూలు చేసింది. నాలుగు రోజులకు కలుపుకుని చూసుకుంటే 140 కోట్లకు పైగా వసూలు చేసింది.

READ  రామ్ చరణ్ సినిమాని పక్కన పెట్టి భారతీయుడు 2 పై దృష్టి పెట్టిన శంకర్

బ్రహ్మాస్త్ర చిత్రం దాదాపు 500 కోట్ల బడ్జెట్‌తో రూపొందించబడింది, RRR, KGF2, బాహుబలి2 వంటి పెద్ద ప్యాన్ ఇండియా బ్లాక్‌బస్టర్‌లతో ఈ చిత్రానికి పోలిక అనివార్యం అవుతుంది. ఈ మూడు సినిమాలు కలెక్షన్స్‌ని చూస్తే 1000 కోట్ల కంటే ఎక్కువ గ్రాస్ వసూలు చేశాయి, ట్రెండ్ చూస్తుంటే బ్రహ్మస్త్ర ఈ చిత్రాలకు దగ్గరగా రావడం సాధ్యం అయేలా కనిపించట్లేదు, బడ్జెట్ మరియు అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే బ్రహ్మస్త్ర కలెక్షన్లు డ్రాప్ అవటం కాస్త ఆందోళన కలిగించే విషయమే. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 500 కోట్ల గ్రాస్ అయినా వసూలు చేస్తే బాక్స్ ఆఫీస్ వద్ద గౌరవప్రదమైన స్థానం సంపాదించుకుంటుంది.

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories