ఈ వారం బాలీవుడ్ ఇండస్ట్రీ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రాజెక్ట్ అయిన బ్రహ్మాస్త్ర చిత్రం విడుదల కానుంది. రణ్బీర్ కపూర్ మరియు అలియా భట్ ప్రధాన పాత్రలలో నటించిన ఈ ఫాంటసీ అడ్వెంచర్ చిత్రం ప్యాన్-ఇండియా స్థాయిలో భారీ స్థాయిలో ప్రచారం జరుపుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ, నిర్మాత కరణ్ జోహార్‌తో పాటు ప్రధాన తారాగణం ఈ చిత్రాన్ని ఇప్పటికి కూడా వీలయినంత ప్రచారం చేయడంలో చాలా బిజీగా ఉన్నారు.
బ్రహ్మాస్త్రతో పాటు తెలుగులో హీరో శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటిస్తున్న ఒకే ఒక జీవితం కూడా సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఒకే ఒక జీవితం అనేది శ్రీ కార్తీక్ దర్శకత్వం వహించిన ఒక సైన్స్ ఫిక్షన్ డ్రామా మరియు నాజర్, అమల, వెన్నెల కిషోర్ మరియు ప్రియదర్శి వంటి ప్రతిభావంతులైన నటీనటులను కలిగి ఉంది.
ఈ రెండు చిత్రాల కాన్సెప్ట్‌లు కూడా చాలా ప్రత్యేకమైనవి మరియు ప్రేక్షకులకు ఆకట్టుకునేవే అయినప్పటికీ, ఈ రెండు చిత్ర యూనిట్లను ప్రస్తుతం ఒక చిన్న విషయం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణలో, సెప్టెంబర్ 9న గణేష్ నిమర్జనం ప్రకటించారు, స్వతహాగా గణేష్ నిమర్జనం రోజున చాలా వరకు రోడ్లు బ్లాక్ చేయబడతాయి. ఆ సమయంలో ట్రాఫిక్ నిభందనల వల్ల ప్రేక్షకులకు థియేటర్ల వద్దకు వచ్చి సినిమాను చూడటం అంత సులభం కాదు కాబట్టి ఈ రెండు సినిమాల గురించి ట్రేడ్ వర్గాలు కాస్త ఆందోళన చెందుతున్న మాట వాస్తవం. ఇది ఖచ్చితంగా సినిమాల మొదటి రోజు కలెక్షన్లపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.
అయితే గణేశుని నిమర్జనం వలన మరీ అంత ఇబ్బంది ఉండే అవకాశం కొన్ని ఏరియాల వరకే ఉంటుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ వంటి ప్రాంతాలలో తప్ప మిగతా ఏరియాలలో అంతగా ప్రజల రద్దీ ఉండదు. ఎందుకంటే ఒకప్పటిలా అన్ని విగ్రహాలను ట్యాంక్ బండ్ వద్ద కాకుండా దగ్గరలో ఎక్కడ చెరువుంటే అక్కడ నిమర్జనం ఏర్పాట్లు చేస్తున్నారు. పైగా హైదరాబాద్ నగరంలో పీవీఆర్ వంటి చాలా మల్టిప్లేక్స్ ధియేటర్లు మెట్రో రైలు స్టేషన్లతో అనుసంధానం కాబడి ఉన్నాయి. అది కూడా సినిమాలు చూడాలనుకునే ప్రేక్షకులకు బాగా సహాయపడుతుంది.
రణబీర్ కపూర్ మునుపటి సినిమా షంషేరా డిజాస్టర్ తర్వాత బ్రహ్మస్త్రతో భారీ హిట్ సాధించాలి. అదే విధంగా, శర్వానంద్ కూడా ఆడవాళ్లు మీకు జోహార్లు, మహాసముద్రం, మరియు శ్రీకారం వంటి వరుస పరాజయాల తరువాత ఆశలన్నీ ఓకే ఒక జీవితం సినిమా పైనే పెట్టుకున్నారు. వీరిద్దరికీ ఈ శుక్రవారం అత్యంత కీలకంగా మారింది.