Homeసినిమా వార్తలుఅనసూయ కు కౌంటర్ గా బ్రహ్మాజీ "అంకుల్" ట్వీట్?

అనసూయ కు కౌంటర్ గా బ్రహ్మాజీ “అంకుల్” ట్వీట్?

- Advertisement -

విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా గత వారం విడుదలై అనూహ్యంగా అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం తొలి రోజు ఉదయాన్నే నెగిటివ్ టాక్ వచ్చిన సంగతి పరోక్షంగా ప్రస్తావిస్తూ ప్రముఖ యాంకర్ /నటి అనసూయ ఒక ట్వీట్ చేయగా.. అందుకు ప్రతిస్పందనగా సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండ అభిమానులతో పాటు ఇతర ట్విట్టర్ యూజర్లు ఆమెను ఎటాక్ చేయడం మొదలుపెట్టారు. ఆమెను ఆంటీ.. ఆంటీ అని పిలిచి గేలి చేస్తూ..అంతటితో ఆగకుండా రకరకాల మేమెలు వాడుతూ, ఆమెను కుదురుగా ఉందనివ్వకుండా ట్వీట్లు చేయడంతో అనసూయ దారుణంగా ట్రోలింగ్‌కి గురయ్యారు.

అయితే అందుకు అనసూయ ఏమాత్రం భయపడలేదు సరికదా.. తనని ట్రోల్ చేసేవారికి కౌంటర్లు ఇస్తూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే తనను ఆంటీ అన్న వాళ్లపై కేసులు పెడతానని హెచ్చరికలు కూడా జారీ చేసారు. అయినా కూడా ట్రోలర్స్ వెనక్కి తగ్గకుండా ఆమెను ఆంటీ అంటూ మరింత గట్టిగా ట్రోలింగ్ చేశారు. ఇక వీళ్ళతో లాభం లేదని సహనం కోల్పోయిన అనసూయ.. తను చెప్పినట్లు గానే చేశారు. తనను ఏజ్ షేమింగ్ చేస్తున్నారంటూ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి..ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన అనసూయ.. నన్ను ట్రోల్ చేసిన వారిపై చర్యలు తీసుకునే ప్రక్రియ మొదలైందని తెలిపారు. యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేసులు గట్రా వద్దని అనుకొని ఇప్పటి వరకు ఓపిక వహించాను కానీ జరగాల్సింది జరగాల్సిందే అని చేయక తప్పలేదు. అని అన్నారు. అలాగే తనకు మద్దతుగా నిలిచిన సైబర్ క్రైమ్ అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

https://twitter.com/anusuyakhasba/status/1564177865276411910?t=-pNx6sMNc0IojohCoatx3g&s=19

ఆంటీ వివాదం ఇలా ఉంటే.. ఇప్పుడు మళ్లీ అంకుల్ వివాదం మొదలైంది. అది ఎవరో కాదు.. నటుడు బ్రహ్మాజీ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. తొలుత ‘వాట్ హ్యాపెనింగ్’ అంటూ ఓ ఫొటో పెట్టారు బ్రహ్మాజీ. దీనిపై ఓ నెగిజన్ స్పందిస్తూ.. ‘ఏం లేదు అంకుల్’ అన్నాడు. అందుకు బ్రహ్మాజీ స్పందిస్తూ.. అంకుల్ ఏంట్రీ అంకుల్.. కేసు వేస్తా.. ఏజ్.. బాడీ షేమింగ్‌ ఆ’ అంటూ స్పందించారు బ్రహ్మాజీ.

READ  భూతద్దం భాస్కర్ నారాయణ ఫస్ట్ గ్లింప్స్ అదుర్స్
https://twitter.com/actorbrahmaji/status/1564612123941953546?t=Zpx-654ls6Pc4no7QSYr9g&s=19

అయితే ఇది ఖచ్చితంగా యాంకర్ అనసూయ తాలూకు వివాదానికి కౌంటర్ గా బ్రహ్మాజీ ట్వీట్ చేశారంటూ.. రీట్వీట్‌ లు చేస్తూ ట్విట్టర్ యూజర్లు రకరకాలుగా కామెడీ చేస్తూ స్పందించారు.

https://twitter.com/TheBaluu/status/1564614851217215507?t=_1HALVKyrQgu8k6F3eEZdw&s=19

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories