Home సినిమా వార్తలు Boycott Calls on Sai Pallavi బ్యాన్ సాయి పల్లవి హ్యాష్ ట్యాగ్ వైరల్

Boycott Calls on Sai Pallavi బ్యాన్ సాయి పల్లవి హ్యాష్ ట్యాగ్ వైరల్

sai pallavi

ప్రస్తుతం టాలీవుడ్ తో పాటు అటు కోలీవుడ్ లో కూడా యువ నటిగా మంచి అవకాశాలతో కొనసాగుతున్నారు సాయి పల్లవి. కెరీర్ పరంగా మంచి సక్సెస్ లతో కొనసాగుతున్న సాయి పల్లవి తాజాగా శివ కార్తికేయన్ హీరోగా చేస్తున్న సినిమా అమరన్. ఈ సినిమాపై అందరిలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన అమరన్ టీజర్, ట్రైలర్ అలానే సాంగ్స్ తో పాటు ఇతర ప్రమోషన్లన్నీ కూడా సినిమాపై మరింతగా అంచనాలు ఏర్పరిచాయి.

మరోవైపు తెలుగు ప్రమోషన్స్ లో కూడా అమరన్ టీం సందడి చేస్తోంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 31న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు రానుంది. అసలు విషయం ఏమిటంటే సాయి పల్లవిని బ్యాన్ చేయాలంటూ ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. పాకిస్థాన్ సైనికులు భారత సైన్యాన్ని ఉగ్రవాద గ్రూపుగా భావిస్తున్నారని, మన వైపు కూడా అదే జరుగుతుందని సాయి పల్లవి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అన్నారు. అయితే ఇది వారి అవగాహనపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తున్నాయి.

సాయి పల్లవి భారత సైన్యాన్ని కించపరిచారని అందుకు ఆమె క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆమె ఎవరినీ అవమానించలేదని, సైన్యం ఎలా పనిచేస్తుందో తెలియజేస్తోందని భావించిన వారు కూడా ఉన్నారు. మరి దీనిపై రాబోయే రోజుల్లో ఏవిధంగా చర్చ నడుస్తుందో చూడాలి. ఇక అమరన్ తప్పకుండా విజయవంతం అవుతుందని ఇప్పటికే ఇటు తెలుగులో కూడా ప్రమోషన్స్ చేస్తూ ఉండటంతో ఇక్కడ కూడా ఈ సినిమా మంచి అవకాశం అందుకున్న అవకాశం అందుకుని టీమ్ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version