ఇటీవల నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో రూపొందిన మూవీ డాకు మహారాజ్. బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేసిన ఈమూవీ అటు ఓటిటి ఆడియన్స్ ని కూడా ఆకట్టుకుంటూ దూసుకెళ్తోంది.
మరోవైపు తాజాగా తన లేటెస్ట్ మూవీ అఖండ 2 షూట్ ప్రారంభించారు బాలకృష్ణ. ఈ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 14 రీల్స్ ప్లస్ సంస్థ పై గోపి ఆచంట, రామ్ ఆచంట గ్రాండ్ గా నిర్మిస్తున్న ఏ ఈమూవీని అఖండ ని మించేలా మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారట దర్శకుడు బోయపాటి శ్రీను.
కాగా ఫస్ట్ పార్ట్ ని మించేలా బాలకృష్ణ పాత్రని మరింత పవర్ఫుల్ గా రాశారట బోయపాటి. ఇక ఈ మూవీ యొక్క నెక్స్ట్ షెడ్యూల్ కోసం తాజాగా తన టీమ్ తో కలిసి హిమాలయాలకు వెళ్లారు బోయపాటి.
అక్కడ పలు ప్రాంతాలని పరిశీలిస్తున్న టీమ్, అతి త్వరలో అక్కడి కీలక ప్రదేశాల్లో షూట్ జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఇక అఖండ 2 మూవీకి థమన్ అందించనున్న సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింతగా అదిరిపోనున్నట్లు టాక్. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 25న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానుంది.