ఈ వారం విడుదలైన చిత్రాలు విరాట పర్వం, గాడ్సే.సత్యదేవ్ నటించిన గాడ్సే టీజర్,ట్రెయిలర్ లో సమకాలీన రాజకీయాలపై ఉన్న డైలాగ్స్ కి చక్కని స్పందన లభించింది. అయితే లేటెస్ట్ సెన్సేషన్ సాయి పల్లవి నటించడంతో విరాట పర్వం సినిమా పై ప్రేక్షకులు మంచి ఆసక్తిని కనబర్చారు.
సోషల్ మీడియా వరకు రానా, సాయి పల్లవి కాంబినేషన్ వల్ల ఆసక్తి పెరిగినా, ఇతర ప్రేక్షకులకు అంతగా పట్టించుకోలేదు. దాని ఫలితంగా చాలా దారుణమైన ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.కనీసం సాధారణ స్థాయిలో కూడా రాకపోవడం విచిత్రం. ఇక గాడ్సే విషయానికి వస్తే తొలి ఆట నుంచే సినిమాని ప్రేక్షకులు తిరస్కరించారు.
విరాట పర్వం వారంతానికి 2.5 కోట్ల షేర్ సాధించి అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. గాడ్సే కు అసలు షేర్ యే రాలేదు. ఈ సినిమాల ఫలితాన్ని అంటే సుందరానికీ ఏమైనా ఉపయోగించుకుంటుంది అనుకుంటే అదీ జరగలేదు.విక్రమ్ సినిమా ఈ వారం కూడా మంచి కలెక్షన్లు రాబట్టగా, మేజర్ కూడా పరవాలేదు అనిపించింది.
ఏదేమైనా వరుస సినిమాలతో కళకళలాడాల్సిన సినిమా ఇండస్ట్రీ వరుస పరాజయాలను చవి చూస్తుంది. కనీసం వచ్చే నెలలో రిలీజ్ అయ్యే పక్కా కమర్షియల్, థాంక్యూ, వారియర్ చిత్రాలు విజయం సాధించి మళ్ళీ ఇండస్ట్రీని ట్రాక్ మీదకి తీసుకు వస్తాయి అని ఆశిద్దాం.