Homeబాక్సాఫీస్ వార్తలుBox-Office: బ్రహ్మస్త్ర రెండు రోజుల ఇండియా వైడ్ కలెక్షన్లు

Box-Office: బ్రహ్మస్త్ర రెండు రోజుల ఇండియా వైడ్ కలెక్షన్లు

- Advertisement -

రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర సినిమా బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల విధ్వంసం సృష్టించింది. మరియు ప్రేక్షకులను విశేష స్థాయిలో ఆకట్టుకుని థియేటర్లకు రప్పిస్తోంది. ఈ చిత్రం మొదటి రోజు విమర్శకుల నుంచి నెగటివ్ రివ్యూలను తెచ్చుకున్నా.. ధియేటర్ల వద్ద మాత్రం భారీ స్థాయిలో ఆక్యుపెన్సీని పొందింది. అలాగే రెండవ రోజు కూడా నిలకడగా రాణిస్తూ మంచి నంబర్లను నమోదు చేసింది.

కాగా రెండవ రోజు బ్రహ్మాస్త్ర (అన్ని వెర్షన్లు కలిపి) 40 కోట్ల రూపాయల నెట్ ను వసూలు చేసింది. ఇక రెండు రోజుల వరకూ అన్ని వెర్షన్ల నెట్ ను పరిశీలిస్తే 75 కోట్లకు భారీ నంబర్ వచ్చింది. ఓవరాల్ గా కేవలం హిందీ వెర్షన్ నుంచి 67 కోట్ల నెట్ రాబట్టగా, ఇతర భాషల్లో 8 కోట్ల రూపాయల నెట్ వసూలు చేసింది. మొత్తంగా రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర మూడవ రోజు కూడా ఘనంగా ఉండేలా కనిపిస్తోంది. ఈ చిత్రానికి అడ్వాన్స్‌ బుకింగ్ల ట్రెండ్ చూస్తుంటే 25 కోట్లకు పైగానే రాబడుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. ఇది చిత్ర నిర్మాతలతో పాటు బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు కూడా ఆనందించే విషయం అనడంలో ఎలాంటి సందేహం లేదు.

గత కొన్ని రోజులుగా, మరీ ముఖ్యంగా కరోనా తరువాత సరైన హిట్ సినిమాలు లేని బాలీవుడ్ ఇండస్ట్రీ కి ‘బ్రహ్మాస్త్ర’ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తొలి రెండు రోజుల వరకు బ్రహ్మాండమైన వసూళ్లు సాధించడం గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ఎన్నో రోజుల తరువాత ఒక హిందీ సినిమాకు తొలి వీకెండ్ వద్ద థియేటర్లకు ప్రేక్షకులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు.

READ  Box-Office: రెండవ రోజు కూడా బలంగా ఉన్న కార్తీకేయ-2 కలెక్షన్లు

సినిమా విడుదలకు ముందు హీరో హీరోయిన్లు ర‌ణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్ దేశంలో వివిధ నగరాలు తిరిగి చేసిన ప్రచారం.. అలాగే నిర్మాత కరణ్ జోహార్, తెలుగు సినీ దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఈ సినిమాకి వెన్నుదన్నుగా నిలబడటంతో ఓపెనింగ్స్ ఇంత బాగా వచ్చాయి. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే కేవలం అడ్వాన్స్ బుకింగ్ల ద్వారానే వీకెండ్ వరకూ కొన్ని స్క్రీన్లు హౌస్ ఫుల్స్ అయిపోయాయి. ఈ రోజు ఆదివారం కాబట్టి తొలి వీకెండ్ అడ్వాంటేజ్ తో ఖచ్చితంగా కలెక్షన్లు బాగుంటాయి. మరి రేపు సోమవారం నుంచి బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ప్రదర్శన ఎలా ఉంటుందనేది చూడాలి.

ఇక తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలో తొలి రోజు ‘బ్రహ్మాస్త్ర’కు రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చాయి. హిందీ డబ్బింగ్ చిత్రాల వరకూ బిగ్గెస్ట్ ఓపెనింగ్ ను సాధించి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంతకు ముందు ఈ రికార్డు ధూమ్ 3 పేరిట ఉండేది. ఈ సినిమాకి గతంలో ఏ హిందీ సినిమాకూ జరగని స్థాయిలో ప్రచారం జరిగింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. దానితో పాటు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున సినిమాలో ముఖ్య అతిథి పాత్ర చేయడం, అలాగే ‘ఆర్ఆర్ఆర్’లో హీరోయిన్ గా నటించిన ఆలియా భట్ ఇందులో నటించడం ఇన్ని ఆసక్తి గొలిపే అంశాలు ఉండటంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమా పై ఆసక్తి కనబరిచారు.

READ  ఈ వారం సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories