తెలుగు సినిమా పరిశ్రమలో స్వశక్తిగా ఎదిగి తనకి తానే రౌడీ స్టార్ గా నామకరణం చేసిన విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘లైగర్’. క్రేజీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాకి కరణ్ జోహార్ అపూర్వ మోహతాలతో పాటు పూరి చార్మి కూడా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.ఈ సినిమాని ప్యాన్ ఇండియా స్థాయిలో నిర్మించారు.
అనన్య పాండే హీరోయిన్ గా నటించగా.. మరో కీలక పాత్రలో రమ్యకృష్ణ నటించగా.. సినిమాలో ఒక ముఖ్యమైన అతిథి పాత్రలో వరల్డ్ ఫేమస్ బాక్సర్ మైక్ టైసన్ నటించారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఏక కాలంలో షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాని తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో ఆగస్టు 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.
సినిమా రిలీజ్ కు దాదాపు నెల రోజుల ముందే ‘లైగర్’ చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను మమ్మురం చేసింది. ఈ సినిమా ద్వారా హీరో విజయ్ దేవరకొండ తొలిసారి బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం కాబోతున్నారు. అందుకే అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ముంబైతో పాట ఇటీవల పలు నగరాల్లోని షాపింగ్ మాల్స్ లో ప్రత్యేకంగా ఈవెంట్ లని నిర్వహించి పబ్లిక్ కు దగ్గరయ్యారు.అంతే కాకుండా ఆ తరువాత పాట్నాకు కూడా వెళ్లిన విజయ్ దేవరకొండ.. అక్కడి వీధుల్లో తిరిగి అభిమానులను అలరించారు.
ఇక ఈ సినిమాకి జరిగిన బిజినెస్ వివరాలు ఎలా ఉన్నాయంటే..ఆంధ్ర ఏరియాకు 28 కోట్ల రేషియోలో బిజినెస్ జరగగా.. సీడెడ్ – 9 కోట్లు, కర్ణాటక- 5.5 కోట్లు,తమిళనాడు- 2.5 కోట్లు, కేరళ – 1.2 కోట్లు,నైజాం – ఓన్ రిలీజ్ కాగా 25 కోట్లకు (valued) అవగా, ఓవర్సీస్ – 8 కోట్ల వరకు బిజినెస్ జరుపుకుంది. ఇక హిందీ – 10 కోట్లకు (valued) జరుపుకుంది. మొత్తం వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ 90 కోట్లకు జరిగింది.
ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ అవడం వల్ల యూత్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఏర్పడింది. ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వం అంటే కిక్ ఎక్కించే మాస్ క్యారెక్టర్, డైలాగ్స్ మాస్ ప్రేక్షకులను బాగా అలరిస్తాయి. మరి ఈ యూత్ హీరో ప్లస్ మాస్ డైరక్టర్ కాంబినేషన్లో వస్తున్న లైగర్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలవాలని కోరుకుందాం.