Homeసినిమా వార్తలుBox-Office: రెండవ రోజు కూడా బలంగా ఉన్న కార్తీకేయ-2 కలెక్షన్లు

Box-Office: రెండవ రోజు కూడా బలంగా ఉన్న కార్తీకేయ-2 కలెక్షన్లు

- Advertisement -

నిఖిల్ సిద్దార్థ్ కథానాయకుడిగా నటించిన తాజా సినిమా ‘కార్తికేయ 2’. ఈ సినిమా విడుదల విషయంలో తెర మీద సినిమాలో జరిగే తరహాలో ట్విస్ట్ లు జరిగి పలుమార్లు వాయిదా పడిన తర్వాత ఈ శనివారం థియేటర్లలోకి వచ్చింది. అయితే సినిమా విడుదలైంది. కానీ, ఆశించిన స్థాయిలో థియేటర్లు లభించలేదు. తక్కువ సంఖ్య ధియేటర్లలో విడుదల అయినప్పటికీ… ఎవరూ ఊహించని స్థాయిలో వసూళ్లు సాధించింది.


కార్తికేయ 2′ సినిమాకు తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ. 8 కోట్ల గ్రాస్ లభించగా.. దాదాపు 5 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఒక టైర్ 2 హీరో నిఖిల్‌కు ఇది చాలా భారీ స్థాయి ఓపెనింగ్ అనే చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో అటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధించింది.


ఆ రకంగా చూసుకుంటే “కార్తికేయ 2″సినిమా తొలి రోజే బడ్జెట్ లో 35 శాతం రికవరీ చేసినట్లు ట్రేడ్ వర్గాల నుంచి అందించిన సమాచారం. ఇక ఈ వారం విడుదలైన మాచర్ల నియోజకవర్గం, మరియు హిందీ చిత్రాలైన లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ సినిమాలకు నెగిటివ్ టాక్ రావడంతో కార్తీకేయ 2 సినిమాకు ఎదురే లేకుండా పోయింది. శనివారం రాత్రి కొన్ని ఏరియాల్లో ఎక్స్ట్రా స్క్రీన్లు, థియేటర్లు పెంచారు.

READ  మహేష్ - రాజమౌళి సినిమా షూటింగ్ మరియు రిలీజ్ డేట్ వివరాలు


ఇక ఆదివారం అంటే ఈరోజు కూడా మార్నింగ్ షోలకు ప్రేక్షకులు భారీ ఎత్తున తరలి వచ్చారు. అదే కాక అంతకు మించిన విశేషం ఏమిటంటే.. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల కార్తీకేయ 2 చిత్రానికి పొద్దున 8-9 గంటల సమయంలో అదనపు షోలు వేయగా అవి కూడా హౌజ్ ఫుల్ అయ్యాయి. దాన్ని బట్టి ఈ చిత్రానికి ప్రేక్షకుల్లో ఎంత ఆదరణ ఉందో అర్థం అవుతుంది.

ఇక ఈ కలెక్షన్ల వరస చూస్తుంటే కార్తీకేయ 2 సినిమా బాక్స్ ఆఫీసు వద్ద ఫుల్ రన్ పూర్తయ్యే సినిమాకి ప్రపంచ వ్యాప్తంగా 30 కోట్ల షేర్ ను సాధిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పైగా రేపు సోమవారం (ఇండిపెండెన్స్ డే హాలిడే) సెలవు రోజు కావడంతో మొదటి మూడు రోజుల్లో అత్యధిక వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. 

చందూ మొండేటి దర్శకత్వం వహించిన ‘కార్తికేయ 2’లో నిఖిల్ సరసన అనుపమా పరమేశ్వరన్ కథానాయికగా నటించారు. శ్రీనివాస రెడ్డి ‘వైవా’ హర్ష సహాయక పాత్రలలో కనిపించారు. ఆదిత్యా మీనన్, తులసి, ప్రవీణ్, సత్య తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఒక కీలక అతిధి పాత్రలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ నటించారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ పతాకాలపై టీజీ విశ్వ‌ప్ర‌సాద్, అభిషేక్ అగ‌ర్వాల్ సంయుక్తంగా నిర్మించారు. తెలుగుతో పాటు హిందీలో ఉత్తరాది ప్రేక్షకుల నుంచి కూడా సినిమాకు మంచి స్పందన లభిస్తోంది.

Follow on Google News Follow on Whatsapp

READ  Box - Office - జూలై తెలుగు సినిమా రిపోర్ట్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories