యువ హీరో నిఖిల్ నటించిన కార్తికేయ 2 ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. విడుదలకు ముందు రకరకాల ఇబ్బందుల వల్ల చిత్ర బృందం తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. కానీ ధియేటర్లలో సినిమా విడుదలైన తరువాత సంచలన విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో హౌజ్ ఫుల్ మరియు సూపర్ హిట్ టాక్ తో ప్రారంభమైంది. కార్తికేయ మొదటి భాగం పెద్ద హిట్ అవడంతో ఈ సీక్వెల్ పై ప్రేక్షకులకు అసక్తి ఏర్పడింది. ఇక ట్రైలర్ కూడా చాలా బాగా కనిపించడంతో ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అటు ప్రేక్షకులు ఓటు ఇండస్ట్రీ వర్గాలు కూడా భావించాయి.
అయితే, కార్తీకేయ 2 సినిమా తెలుగు రాష్ట్రాల్లో విజయం సాదించడం అందరూ ఊహించన విషయమే అయినప్పటికీ.. అనూహ్యంగా హిందీ వెర్షన్ కూడా విజయం సాధించడం చాలా మంది ట్రేడ్ విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.
ఈ వారం లాల్ సింగ్ చద్దా, రక్షా బంధన్ వంటి బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదల అవడంతో.. కార్తీకేయ 2 చాలా తక్కువ ధియేటర్ లలో విడుదల అయింది.కానీ సినిమా చూసిన ప్రేక్షకులు అద్భుతమైన టాక్ ఇవ్వడంతో రోజు రోజుకూ స్క్రీన్స్ పెంచుకుంటూ ఈ సినిమా హిందీ మార్కెట్లో దూసుకుపోతోంది.
ఇక గత వారం విడుదలైన సీతా రామం కూడా బాక్స్ ఆఫీసు వద్ద తన హవాను కొనసాగిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే బ్రేక్ ఈవెన్ మార్క్ సాధించిన ఈ చిత్రం ఇతర దక్షిణ రాష్ట్రాల్లో కూడా చక్కని స్పందన తెచ్చుకుంది.
సీతా రామం చిత్రం విడుదలై 12 రోజుల వరకు కేరళలో 6.2 కోట్ల గ్రాస్, మరియు తమిళనాడులో 7.3 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మంచి ఆక్యుపెన్సీలతో బాక్స్ ఆఫీస్ వద్ద స్టడీగా నడుస్తుంది. మొత్తంగా అన్ని భాషల్లోనూ పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన సీతా రామం చిత్రం ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ (అన్ని భాషలు కలుపుకుని) దాటి 75 కోట్ల మార్క్ దిశగా దూసుకుపోతోంది.