హీరో గోపీచంద్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో పక్కా కమర్షియల్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూలై 1, 2022న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రమోషన్స్ లో భాగంగా చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్, ట్రైలర్ లకు మంచి స్పందన వచ్చింది. అలాగే జేక్స్ బిజాయ్ అందించిన పాటలు కూడా పరవాలేదు అనిపించాయి.ఈ సినిమాలో నేరస్థుల తరపున వాదించే లాయర్ గాహీరో గోపీచంద్ క్యారెక్టరైజేషన్ చాలా బాగుందని అంటున్నారు. దీంతో పాటు రాశీ ఖన్నా రోల్ కూడా ఆకట్టుకునేలా ఉంటుందని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది.
ఇక రెండు రోజుల క్రితం జరిగిన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ కూడా సూపర్ సక్సెస్ అనిపించుకుంది.మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరైన ఆ ఈవెంట్ అందరినీ అలరించింది.
ఈ సినిమా విడుదల విషయంలో అనేక సార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. ప్రతిరోజు పండగే లాంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత మారుతి చేస్తున్న సినిమా పక్కా కమర్షియల్. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ కలిసి, బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిస్తున్నారు మారుతి. ఈ సినిమాలో గోపీచంద్ క్యారెక్టర్ ను మారుతి అద్భుతంగా డిజైన్ చేశారట. కెరీర్లో ఎప్పుడూ లేనంత కొత్తగా గోపీచంద్ చాలా స్టైలిష్ గా కనిపించనున్నారట. సత్యరాజ్ ఈ సినిమాలో హీరో తండ్రిగా కీలక పాత్రలో నటిస్తున్నారు.
హీరోగా గోపీచంద్ ప్రస్తుతం అంత ఫామ్ లో లేకపోయినా, ఓన్ రిలీజ్ గా విడుదల అవుతున్న ఈ సినిమాను మారుతి మరియు గీతా ఆర్ట్స్ బ్యానర్ బ్రాండ్ వాల్యూ వల్ల ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ 20 కోట్లకు (valued) సెటిల్ అయిందని తెలుస్తుంది.సినిమాకు మంచి బజ్ ఉన్నందున సరైన టాక్ వస్తే ఇక కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం.