Homeసినిమా వార్తలుBox-Office అంటే సుందరానికీ నాలుగవ రోజు కలెక్షన్ లు పెద్ద షాక్

Box-Office అంటే సుందరానికీ నాలుగవ రోజు కలెక్షన్ లు పెద్ద షాక్

- Advertisement -

అంటే సుందరానికీ సినిమా టైటిల్ చూస్తే హీరోకి ఏదో సమస్య ఉందని సందేహం వచ్చేలా ఉంటుంది. ప్రోమోలు , ట్రెయిలర్ లలో కూడా అలాగే ప్రచారం చేశారు. అయితే ఇప్పుడు సినిమా లో నిజంగానే ఏదో సమస్య ఉందేమో అనిపించేలా ఉంది ఆ సినిమా కలేక్షన్ ల పరిస్థితి.

రోజు రోజుకూ ఆ సినిమా కలేక్షన్ లు మరీ తీసికట్టుగా ఉంటున్నాయి. ప్రీ రిలీజ్ బజ్ సరిగా లేకున్నా, రివ్యూలు బాగా రావడంతో తరువాత అయినా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊపు అందుకుంటుంది అని డిస్త్రిబ్యుటర్ లు ఆశించారు.అయితే వారి ఆశలు అన్నీ ఆవిరి అయిపోయేలా ఉంది సుందరం గారి కలేక్షన్ ల హోమం.

శ్యామ్ సింఘా రాయ్ కూడా అంచనాలను అందుకోలేక పోయినా కనీసం డీసెంట్ హిట్ గా నిలిచింది. కానీ అంతే సుందరానికీ ఓపెనింగ్స్ లో కూడా నాని రేంజ్ లో రాలేదు.తొలి 3 మూడు రోజుల షేర్ కేవలం 15 కోట్ల వరకూ వచ్చింది. కనీసం కిందా మీదా పడుతూ అన్నా ఒక మోస్తరు స్థాయికి వస్తుంది అనుకుంటే సోమవారం రెండు రాష్ట్రాలకూ కలిపి కేవలం 70 లక్షల షేర్ రావడం ట్రేడ్ వర్గాలను షాక్ కు గురి చేసింది.

READ  మళ్ళీ సినిమాలకు గుడ్ బై చెప్పనున్న పవన్?

వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకి జరిగిన బిజినెస్ 31 కోట్లు అయితే పైన చెప్పుకున్నట్టు ఇప్పటి దాకా కేవలం 15 కోట్ల షేర్ వచ్చింది. ఈ రన్ చూస్తుంటే ఇంక పోను పోను వచ్చే చిల్లరకు షేర్ అంటూ ఆడ్ చేసేందుకు ఏమీ మిగిలేలా లేదు.

సినిమా లో కంటెంట్ లేకపోవడం వల్లనో, లేదా టాక్ బాగా రాకపోవడం వల్ల ఆడకపోతే ఒక అర్థం. కానీ సినిమాలో సరైన కంటెంట్ తో పాటు పాజిటివ్ టాక్ వచ్చినా ప్రేక్షకులు ధియేటర్ వైపు కదలలేదు అంటే కారణాలు ఎంటో ఎవ్వరికీ అంతుపట్టట్లేదు.

Follow on Google News Follow on Whatsapp

READ  ఏనుగునే భయపెట్టిన విక్రమ్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories