దాదాపు మూడు నెలలకు పైగా తెలుగు చిత్ర పరిశ్రమ సరైన హిట్లు లేక థియేటర్లు వెలవెల బోయాయి. అసలు సినిమాలు చూడటానికి ప్రేక్షకులు మునుపటిలా సినిమాలకు వస్తారా లేదా అని ఇండస్ట్రీ వర్గాలు అనుమానాలు ఏర్పడిన నేపథ్యంలో.. గత వారం విడుదలైన బింబిసార మరియు సీతా రామం సినిమాలు పరిశ్రమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చాయి.ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద చక్కని వసూళ్లను సాధించాయి. అంతే కాకుండా తెలుగు ప్రేక్షకుల నుండి విశేష స్థాయిలో ఆదరణ పొందాయి. ఇక ఈ రెండు సినిమాలు తొలి వారం పూర్తయ్యే సరికి బ్రేక్ ఈవెన్ సాధించాయి. ఇప్పుడు వస్తున్న కలెక్షన్లు అన్నీ లాభాలే. బింబిసార మరియు సీతా రామం మొదటి వారం కలెక్షన్ల వివరాలు చూద్దాం.
బింబిసార బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఓపెనింగ్స్ ను సంపాదించి, ఆ తర్వాత రెండవ, మూడవ రోజు కూడా అదే హవాను కొనసాగించింది. ఈ సినిమా విడుదలకు ముందే చక్కని అంచనాలతో ఉండింది. ఇక విడుదల తరువాత ఆ పాజిటివ్ బజ్ సినిమాకు ఎంతగానో సహాయపడింది. అంతే కాక బింబిసార చిత్రం అటు నిర్మాతలు, పంపిణీదారులు మరియు ఎగ్జిబిటర్లకు భారీ లాభాలను తెచ్చి పెట్టింది.
బింబిసార మొదటి వారం 25 కోట్ల కలెక్షన్ సాధించింది. పైగా కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ హిట్ అయిన పటాస్‌ను భారీ ఆధిక్యంతో దాటింది. బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి 30 కోట్ల షేర్ మార్క్ ను చేరుకోవడానికి చాలా దగ్గరలో ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 16 కోట్లకు జరుపుకుంది. ఆ రకంగా ఈ చిత్రం అందరికీ అత్యంత లాభదాయకమైన సినిమాగా నిలిచింది.
ఇక మ్యాజికల్ లవ్ స్టొరీలా తెరకెక్కిన సీతా రామం తొలి రోజు వసూళ్ల పరంగా కాస్త సాధారణంగా ఉన్నప్పటికీ.. అయితే తొలి రోజుతో పోలిస్తే ఈ సినిమా కలెక్షన్లు రెండూ రోజు పెరిగాయి. వాటి కంటే మూడో రోజు అలా స్టడీగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా ఎదుగుతూ వచ్చింది. సినిమా అద్భుతంగా ఉంది అన్న మౌత్ టాక్ వల్ల చాలా లాభ పడింది సీతా రామం. సరైన సినిమాకి పాజిటివ్ టాక్ ఏ రకంగా ఉపయోగ పడుతుందో మరోసారి రుజువు చేసింది.
సీతా రామం తెలుగు వెర్షన్ ప్రపంచ వ్యాప్తంగా 14 కోట్ల వరకు సాధించింది. ఇక సోమవారం అంటే ఆగస్ట్ 15 నాటికి 20 కోట్ల షేర్ మార్క్‌ను చాలా సులభంగా చేరుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. సినిమా విడుదలకు ముందు ఎవరూ ఊహించకపోయినా ఈ సినిమా అద్భుతంగా రూపొంది, ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుని బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
ఓవరాల్‌గా సీతా రామం మరియు బింబిసార రెండూ అద్భుతమైన బాక్సాఫీస్ కలెక్షన్లను నమోదు చేశాయి.