నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ ‘అంటే సుందరానికీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను దక్కించుకుంది. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీగా తెరకెక్కించగా, ఇందులో మలయాళ బ్యూటీ నజ్రియా నాజిమ్ హీరోయిన్‌గా తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.
ముందుగానే చెప్పుకున్నట్టు ఈ సినిమా తొలి మూడు రోజుల కలెక్షన్ లు పరవాలేదు అనిపించగా, సోమవారం నుండి బాక్స్ ఆఫీస్ రేస్ లో చాలా వెనుక పడిపోయింది.కలెక్షన్స్ దారుణంగా పడిపోవడంతో, ఈ సినిమా టోటల్ రన్‌లో ఎలాంటి ఫలితాన్ని మిగిలిస్తుందా అని చిత్ర యూనిట్ ఆందోళన చెందగా,అయితే ఇలాంటి సమయంలో ఒక్క దగ్గర మాత్రం అంటే సుందరానికీ కాస్త గౌరవప్రదమైన కలెక్షన్లు రాబడుతుంది. వన్ మిలియన్ మైల్ స్టోన్ మార్క్‌ను అందుకునేందుకు రెడీ అయ్యింది. నాని సినిమాలంటే ఓవర్సీస్ ఆడియెన్స్‌కు ముందు నుంచే ప్రత్యేక అభిమానం.
అందులోనూ అంటే సుందరానికీ చిత్రం ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ అవడంతో ఈ సినిమాను చూసేందుకు అక్కడి ఆడియెన్స్ ఎంతో ఆసక్తిని కనబరిచారు. ఈ క్రమంలోనే ఈ సినిమాకు అక్కడ వసూళ్లు వచ్చాయి. అయితే ఇప్పటికే ఈ చిత్రం యూఎస్ బాక్సాఫీస్ వద్ద వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను అందుకుంది, యూఎస్ బాక్సాఫీస్ వద్ద మిలియన్ మార్క్ క్లబ్‌లో నానికి ఇప్పటికే వన్ మిలియన్ సినిమాలు ఆరు ఉన్నాయి. ఈ చిత్రంతో ఏడో సినిమా అవుతుంది. ఇతర హీరోలలో మహేష్ బాబు కి పదకొండు సినిమాలు ఈ ఘనత సాధించగా,ఎన్టీఆర్ కు కూడా ఏడు సినిమాలు ఉన్నాయి.
ఇప్పుడు అంటే సుందరానికీ చిత్రం కూడా ఈ మార్క్‌ను అందుకుంటే, ఇది అతడి కెరీర్‌లో ఏడవ మిలియన్ డాలర్ సినిమాగా మిగలడం ఖాయం.
మొత్తానికి మంచి టాక్ లభించినా కలెక్షన్ లు సరిగా రాలేదు అనే పరిస్తితి నుండి కనీసం ఒక్క ఏరియాలో అయినా సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ అందుకోవడం కాస్త మంచి విషయమే అని చెప్పాలి. ఇక నాని నటించే తదుపరి సినిమాలైనా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి సూపర్ హిట్ గా నిలుస్తాయి అని ఆశిద్దాం.