Homeసినిమా వార్తలుRe-releases: బద్రి - తొలి ప్రేమ రీ రిలీజ్ ప్లాన్స్ క్యాన్సిల్

Re-releases: బద్రి – తొలి ప్రేమ రీ రిలీజ్ ప్లాన్స్ క్యాన్సిల్

- Advertisement -

జల్సా, ఖుషి రీ రిలీజ్ లు భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో పవన్ కళ్యాణ్ పాత బ్లాక్ బస్టర్ సినిమా బద్రి రీ రిలీజ్ ను ఫిబ్రవరి 11న, తొలిప్రేమను వాలెంటైన్స్ డే స్పెషల్ గా ఫిబ్రవరి 14న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ రెండు సినిమాల విడుదల క్యాన్సిల్ అయినట్లు తెలుస్తోంది.

రీ రిలీజ్ క్యాన్సిల్ కావడానికి కారణం అభిమానుల్లో ఉన్న నిరాసక్తత అని తెలుస్తోంది. ఎందుకంటే కేవలం క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు పాత హిట్ సినిమాలను విడుదల చేయడం సరికాదని.. అలాగే సందర్భం లేకుండా సినిమాలను రీ రిలీజ్ చేయడం మంచిది కాదని అభిమానులే సూచించారని సమాచారం.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా మాత్రమే ఫిబ్రవరి 11న విడుదల కాబోతోంది. శరత్ కుమార్, మురళీ మోహన్, ఆనందరాజ్, రావుగోపాల్ రావు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. విజయ్ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బప్పీ లాహిరి సంగీతం అందించారు.

READ  Waltair Veerayya: వాల్తేరు వీరయ్య సినిమాలో అండర్ కవర్ కాప్ గా కనిపించనున్న మెగాస్టార్ చిరంజీవి?

పోకిరి (2006)తో తెలుగు చిత్ర పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ కు ఒక్కసారిగా క్రేజ్ వచ్చింది. ఇకఆ తర్వాత జల్సా (2008), ఖుషి (2001), ఒక్కడు (2003) చిత్రాలు వరుసగా రీ రిలీజ్ ల రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.

మొదట్లో పాత హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయాలనే ఆలోచన కేవలం అభిమానులను మాత్రమే కాకుండా ఆ సినిమాలను మళ్ళీ థియేటర్లో చూడాలనే ఉత్సాహం సాధారణ ప్రేక్షకులలో కూడా కలిగింది. ఒక్కో హీరో అభిమానులు ఒక్కో సినిమాని ఎంచుకుని రీ రిలీజ్ చేయడానికి రకరకాల సన్నాహాలు చేశారు.

అయితే కొంత కాలం వరకు ఈ వరస బాగానే ఉన్నా తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ప్రేక్షకుల పై పడటంతో అందరికీ మొహం మొత్తినట్టు అయింది. ఇక మీదట అభిమానులు, నిర్వాహకులు ఈ రీ రిలీజ్ లకు గ్యాప్, పర్ఫెక్ట్ టైమింగ్ చూసుకుంటే అందరికీ మంచిది.

Follow on Google News Follow on Whatsapp

READ  Thaman: వారిసు, వీరసింహారెడ్డి వర్క్ తో థమన్ కు నిద్రలేని రాత్రులు


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories