యువ నటుడు అక్కినేని నాగచైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా యువ దర్శకుడు చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల్ మూవీ పై అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలు అన్ని కూడా అందరినీ ఆకట్టుకుని ఆ అంచనాలు మరింత పెంచేసాయి అని చెప్పాలి.
గీతా ఆర్ట్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో నిర్మితం అయిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఇక త్వరలో ఆడియన్స్ ముందుకి రానున్న తండేల్ హిందీ ఈవెంట్ లో భాగంగా ట్రైలర్ ని అమిర్ ఖాన్ రిలీజ్ చేసి టీమ్ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే మ్యాటర్ ఏమిటంటే, ఇప్పటికే ఈ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా గ్రాండ్ కూడా బాగానే జరిగింది. ఇక కంటెంట్ పై ముఖ్యంగా ఓవరాల్ మూవీ పై టీమ్ అయితే ఎంతో నమ్మకంగా ఉంది .
ఇక ఇటు తండేల్ టికెట్ బుకింగ్స్ పరిస్థితి చూస్తే అటు ఓవర్సీస్ తో పాటు తెలుగులో సైతం పర్వాలేదనిపించే స్థాయిలో ఉన్నాయి తప్ప అదరహో అనే రేంజ్ లో అయితే లేవు. కాగా ముందు ఇలాంటి మూవీస్ కి రెస్పాన్స్ ఇలానే ఉంటుందని, తప్పకుండా తమ హీరో మూవీ పెద్ద సక్సెస్ ఖాయమని అక్కినేని ఫ్యాన్స్ అంటున్నారు .