Home సినిమా వార్తలు Bhushan Kumar: మహేష్, ఎన్టీఆర్ తదితరులతో సంప్రదింపులు జరిపిన బాలీవుడ్ బడా నిర్మాత భూషణ్ కుమార్

Bhushan Kumar: మహేష్, ఎన్టీఆర్ తదితరులతో సంప్రదింపులు జరిపిన బాలీవుడ్ బడా నిర్మాత భూషణ్ కుమార్

పాన్ ఇండియా కాన్వాస్ పై తెలుగు సినిమాలను నిర్మించడానికి బాలీవుడ్ అగ్ర నిర్మాత భూషణ్ కుమార్ సూపర్ స్టార్ మహేష్, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ తదితరులను కలవడానికి హైదరాబాద్ వచ్చి వెళ్లినట్లు తాజా సమాచారం ఈ స్టార్స్ డేట్స్ కోసం ఆయన ప్రయత్నించినట్లుగా తెలుస్తోంది.

పుష్ప, ఆర్ఆర్ఆర్ వంటి భారీ పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ హిట్స్ తో తెలుగు చిత్ర పరిశ్రమ గత రెండేళ్లలో మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు మన సినిమాలు, స్టార్స్ క్రేజ్ పెరగడం వల్ల తెలుగు సినిమాల పరిశ్రమకు కూడా క్రేజ్, రీచ్ పెరిగిందనే చెప్పాలి.

కాబట్టి ఈ ట్రెండ్ ను ఫాలో అవుతూ త్వరలోనే పైన చెప్పిన సూపర్ స్టార్స్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ చేయాలనేది భూషణ్ కుమార్ ఆలోచనగా కనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఆయన సదరు స్టార్ హీరోలతో కూడా చర్చించినట్లు చెబుతున్నారు.

భూషణ్ కుమార్ ఇప్పటికే ప్రభాస్ సాహో, రాధేశ్యామ్ చిత్రాలను నిర్మించారు కాబట్టి తెలుగు సినిమాలకు ఆయనేమి కొత్త కాదు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న తెలుగు సినిమాలను ఎక్కువ మంది ప్రేక్షకులకు రీచ్ అయ్యేలా చేయడానికి ఆయన ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.

పాన్ ఇండియా మార్కెట్ లో ఇప్పుడు తెలుగు సినిమాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రముఖ తెలుగు స్టార్స్ ని కలవడానికి ఒక టాప్ ర్యాంక్ బాలీవుడ్ ప్రొడ్యూసర్ హైదరాబాద్ రావడం దీనికి పెద్ద ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version