బాలీవుడ్ లో కొన్నేళ్ల క్రితం రిలీజ్ అయిన డాన్ సిరీస్ లోని రెండు సినిమాలకు అందరిలో ఎంత క్రేజ్ ఉందో అవి ఎంతటి భారీ విజయాలనుకున్నాయో మనకి తెలిసిందే. బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాల అనంతరం తాజాగా త్వరలో సెర్చ్ మీదకు వెళ్లనున్న సినిమా డాన్ 3.
ఈ సినిమాలో రణ్వీర్ సింగ్ హీరోగా నటిస్తున్నట్టు ఇప్పటికే మూవీ టీం ఒక చిన్న వీడియో గ్లింప్స్ ద్వారా అనౌన్స్మెంట్ అందించింది. అయితే ఈ సినిమాలో వాస్తవానికి హీరోయిన్ గా కియారా అద్వానీ నటించనున్నట్లు అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం టీం నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కియారా స్థానంలో యంగ్ బ్యూటీ కృతి సనన్ ని తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ప్రెగ్నెన్సీ కారణంగా కియారా అద్వానీ ఈ సినిమా నుంచి తప్పుకోవడమే కారణం అని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని త్వరలోనే యూరప్ సహా పలు విదేశాల్లోని గ్రాండ్ లొకేషన్స్ లో తెరకెక్కించనున్నారు. ఫర్హాన్ అక్తర్ తెరకెక్కించనున్న ఈ సినిమాకు సంబంధించి త్వరలో పూర్తి డీటెయిల్స్ అధికారికంగా టీం నుంచి వెలువడనున్నాయి. మరి అందరిలో మంచి క్రేజ్ కలిగిన ఈ మూవీ రిలీజ్ అనంతరం ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.