Homeసినిమా వార్తలుఈ వారం సినిమాల బుకింగ్స్: షాక్ లో బాలీవుడ్

ఈ వారం సినిమాల బుకింగ్స్: షాక్ లో బాలీవుడ్

- Advertisement -

బాలీవుడ్ లో ఈ వారం రెండు పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడుతున్నాయి. గత కొంత కాలంగా బాలీవుడ్ సినిమాలకు కష్ట కాలం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో రెండు పెద్ద సినిమాలు ఒకే వారంలో రావడం అనేది ఖచ్చితంగా ఇబ్బందికరం అని ఇండస్ట్రీ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. ఇలాంటి క్లిష్ట సమయంలో రెండు సినిమాలు ఎదురు పడితే రెండిటికీ కూడా వసూళ్ల పరంగా నష్టం తప్పక పోవచ్చు అని ట్రేడ్ వర్గాల వాదన.

ఇక రెండు సినిమాల్లో ఆమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమాను ప్రపంచ వ్యాప్తంగా దాదాపుగా 4 వేల స్క్రీన్స్ లో విడుదల చేస్టున్నారు. ఈ సినిమాని కేవలం హిందిలోనే కాకుండా తెలుగులో కూడా విడుదల చేస్తున్నారు. ఎందుకంటే ఈ చిత్రంలో అక్కినేని నాగ చైతన్య ఒక ముఖ్య పాత్రలో కనిపిస్తున్నారు కాబట్టి.

మరో వైపు అక్షయ్ కుమార్ నటించిన ‘రక్షాబంధన్’ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా 4.2 వేల ధియేటర్లలో విడుదల చేస్తున్నారట. లాల్ సింగ్ చడ్డా సినిమాలో హీరోగా సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ ఉండటం వల్ల ఆ సినిమా పై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగా ఉండటం సహజం. ఇక అక్షయ్ కుమార్ వరుసగా సినిమాలు చేస్తూ మధ్య మధ్యలో హిట్ లు ఇస్తూ ఉంటారు. ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో సినిమా వచ్చి ఆరేళ్లు అయింది.

READ  నిర్మాతగా మారనున్న సాయి పల్లవి

ఇక రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్ ఎలా ఉన్నాయి అనే విషయానికి వస్తే.. రెండు సినిమాల్లో లాల్ సింగ్ చడ్డా యొక్క ముందస్తు అమ్మకాలు కాస్త పరవాలేదు అనేలా ఉన్నాయి. అక్షయ్ కుమార్ సినిమా కంటే ఆమీర్ ఖాన్ సినిమాను చూసేందుకే బాలీవుడ్ ప్రేక్షకులు అసక్తి చూపిస్తున్నారు. అయితే ఇందులో అంతగా ఆనందం పొందాల్సిన విషయం ఏమీ లేదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.

ఎందుకంటే కేవలం రక్షా బంధన్ తో పోల్చుకుంటే లాల్ సింగ్ చడ్డా బుకింగ్స్ కాస్త బాగున్నాయి కానీ మామూలుగా చూస్తే ఆశ్చర్యకరంగా రెండు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ ఘోరంగా ఉన్నాయనే చెప్పాలి. తొలి రోజు అక్షయ్ కుమార్ రక్షా బంధన్ 12 కోట్ల స్థాయిలో, అమీర్ ఖాన్ సినిమా 18 కోట్ల స్ధాయలో నెట్ కలెక్షన్లు సాధించవచ్చు అని ఒక అంచనా. ఇవి నిజంగా చాలా తక్కువ, పేలవమైన అడ్వాన్స్ బుకింగ్‌లు అనే చెప్పాలి. స్టార్ హీరోల సినిమాలకు ఇలాంటి బుకింగ్స్ ఉండటం ఏంటని ట్రేడ్ వర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

READ  లైగర్ సినిమా సెన్సార్ టాక్

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories