Homeసినిమా వార్తలుబాలీవుడ్ హీరో రణ్ బీర్ నోట.. తెలుగు మాట

బాలీవుడ్ హీరో రణ్ బీర్ నోట.. తెలుగు మాట

- Advertisement -

బ్రహ్మాస్త్ర సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిన్న జరగాల్సింది. కానీ చివరి నిమిషంలో భద్రతా కారణాల వల్ల ఆ ఈవెంట్ ను రద్దు చేసి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశం భారీ విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, రాజమౌళితో పాటు చిత్ర తారాగణం రణ్ బీర్ కపూర్, అలియా భట్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో నిర్మాత కరణ్ జోహార్ కూడా పాల్గొన్నారు.

ఎన్టీఆర్ ఎప్పటిలానే తనదైన శైలిలో సినిమా పరిశ్రమ బాగోగుల గురించి ఆలోచింపజేసే ప్రసంగం చేసి ఆకట్టుకున్నారు, అయితే బ్రహ్మస్త్ర చిత్ర హీరో రణ్ బీర్ కపూర్ తన తెలుగు ప్రసంగంతో అందరి మనసులను దోచుకున్నారు.

తన కెరీర్ లోనే ఇది భారీ సినిమా అని.. ఎంతగానో ప్రచారం జరుపుకుని వచ్చిన ఈ బ్రహ్మస్త్ర సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చుతుందని నమ్ముతున్నట్లు రణ్ బీర్ కపూర్ అన్నారు. అలాగే ఈవెంట్ కు తరలి వచ్చిన అక్కినేని మరియు నందమూరి అభిమానులకి కృతజ్ఞతలు తెలిపారు.తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ గొప్ప సినిమాలను ఎలా ఆదరిస్తారో అలాగే బ్రహ్మాస్త్రాన్ని కూడా ఆదరించాలని రణ్ బీర్ అభ్యర్థించారు. అంతే కాకుండా బ్రహ్మాస్త్ర 2 సినిమా ఈవెంట్‌లో తప్పకుండా తెలుగులో అనర్గళంగా మాట్లాడతానని హామీ ఇచ్చారు.

READ  Box-Office: కోబ్రాతో కమ్ బ్యాక్ ఇవ్వనున్న చియాన్ విక్రమ్

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సూపర్ హీరో చిత్రాన్ని దక్షిణాది భాషల్లో ఎస్ఎస్ రాజమౌళి సమర్పించనున్నారు. ఈ సినిమాలో రణ్ బీర్ సూపర్ హీరోగా నటిస్తుండగా, నాగార్జున ఆర్కియాలజిస్ట్ పాత్రలో కనిపించనున్నారు. అమితాబ్ బచ్చన్ ప్రొఫెసర్‌గా, అలియా భట్ రణబీర్ ప్రేమికురాలి పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రం మూడు భాగాలుగా విడుదల కానుంది. ప్రస్తుతం భారత దేశ వ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ప్యాన్ ఇండియా చిత్రాలలో బ్రహ్మస్త్ర ఒకటి. బ్రహ్మాస్త్ర చిత్రం 9 సెప్టెంబర్ 2022న విడుదలకు సిద్ధంగా ఉంది. కాగా తదుపరి భాగాలు ఎప్పుడు విడుదల అవుతాయి అనేది త్వరలో ప్రకటిస్టారు.

Follow on Google News Follow on Whatsapp

READ  ప్రభాస్ బర్డ్ డే రోజు ఫ్యాన్స్ ట్రిపుల్ హంగామా


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories