ఇటీవల క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన పుష్ప 2 మూవీ ద్వారా అతిపెద్ద ఇండియన్ బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్ లెవెల్లో రూపొందిన పుష్ప 2 మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా కనిపించగా రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ దీనికి సంగీతం అందించారు.
ఇక ఈ మూవీ అనంతరం తాజాగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన తదుపరి మూవీ చేయడానికి సిద్ధమవుతున్నారు అల్లు అర్జున్. గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్ సంస్థలు దీనిని ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నాయి. అయితే ఈ మూవీ తరువాత సన్ పిక్చర్స్ సంస్థపై యువ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో ఒక మూవీ చేయనున్నారు అల్లు అర్జున్.
ఇప్పటికే అల్లు అర్జున్ మరియు అట్లీల మధ్య ఈ సినిమాకు సంబంధించిన చర్చల పలుమార్లు జరుగగా త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా రానుందని అంటున్నారు. అయితే లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ మూవీలో బాలీవుడ్ అందాల కథానాయిక జాన్వి కపూర్ హీరోయిన్ గా నటించనున్నారని తాజాగా ఆమెను కలిసిన దర్శకుడు అట్లీ ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా అందుకున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఇదే నిజం అయితే తొలిసారిగా అల్లు అర్జున్ తో జాన్వీ జోడీ కడుతున్న మూవీ ఇదే అవుతుంది.