స్టార్ నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ పాన్ ఇండియన్ మాస్ యాక్షన్ మూవీ పుష్ప 2 ది రూల్. ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా భారీ స్థాయిలో అత్యధిక వ్యయంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, వై రవిశంకర్ నిర్మిస్తున్నారు.
ఇప్పటికే షూటింగ్ ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకున్న పుష్ప 2 ది రూల్ మూవీ డిసెంబర్ 6న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది. పుష్ప 1 మూవీలో టైటిల్ రోల్ లో తన అద్భుత నటనకు గాను నేషనల్ అవార్డు సొంతం చేసుకున్న అల్లు అర్జున్, ఇందులో మరింత పవర్ఫుల్ గా కనిపించనున్నారట. అలానే ఫస్ట్ పార్ట్ ని మించేలా దర్శకుడు సుకుమార్ సెకండ్ పార్ట్ ని మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నటు చెప్తున్నారు.
పుష్ప 1 లోని స్పెషల్ సాంగ్ ఊ అంటావా మావలో అల్లు అర్జున్ తో కలిసి చిందేశారు సమంత. ఆ సాంగ్ బ్లాక్ బస్టర్ గా రెస్పాన్స్ సొంతం చేసుకుంది. విషయం ఏమిటంటే, పుష్ప 2 మూవీలో కూడా మంచి స్పెషల్ సాంగ్ ఉందని, ఆ సాంగ్ లో బాలీవుడ్ అందాల నటి శ్రద్ధ కపూర్ నటించనున్నారనేది లేటెస్ట్ టాలీవుడ్ బజ్. ఈ సాంగ్ ఆడియో పరంగా అలానే విజువల్ గా కూడా అదిరిపోయేలా మేకర్స్ సిద్ధం చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి మేకర్స్ నుండి అఫీషియల్ అనౌన్స్ మెంట్ అయితే రావాల్సి ఉంది.