Homeసినిమా వార్తలుబాలీవుడ్ ప్రేక్షకులు అమీర్ ను మరచి పోయారా?

బాలీవుడ్ ప్రేక్షకులు అమీర్ ను మరచి పోయారా?

- Advertisement -

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చడ్డా సినిమా ఈరోజు విడుదలైన సంగతి తెలిసిందే. అయితే సాధారణంగా అమీర్ సినిమా అంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అనిపించేలా ప్రచార కార్యక్రమాలు.. సినిమా ప్రోమోలు వగైరాలతో అట్టహాసంగా సందడిగా వాతావరణం ఉంటుంది.అయితే ఈసారి అందుకు భిన్నంగా ఏమాత్రం సానుకూల పరిస్థితి లేకుండా.. బాయ్కాట్ నినాదాల మధ్య.. సినిమా ఫలితం ఏమవుతుందో అనే అయోమయాల మధ్య ఈ రోజు లాల్ సింగ్ చడ్డా సినిమా థియేటర్లలో విడుదలైంది.

అయితే నిజానికి ఈ సినిమాని బహిష్కరించాలి అన్న ప్రచారం చాలా వరకు పిచ్చి పుకార్ల వల్ల, లేక అనవసరమైన ద్వేషం వల్ల జరిగింది.అయితే ఈ నెగటివ్ పబ్లిసిటీ చిలికి చిలికి గాలివానగా మారినట్లు చివరికి సినిమా ఓపెనింగ్స్ పైన ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. లాల్ సింగ్ చద్దా ఓపెనింగ్ రోజు బాక్స్ ఆఫీసు వద్ద చాలా సాధారణ స్థాయిలో కలెక్షన్లు నమోదు చేసుకుంది. అంతే కాకుండా, సమీక్షలు కూడా పేలవంగా ఏమాత్రం సినిమాకు సహకరించేలా లేవు.

అయితే ఈరోజు పరిస్థితిని చూసిన బాలీవుడ్ వర్గాలు ఆలోచనలో పడ్డారు. అసలు ప్రేక్షకులు తిరస్కరించింది లాల్ సింగ్ చడ్డా సినిమానా లేక అమీర్‌ ఖాన్ ను తిరస్కరించారా అనే చర్చకు దారి తీసింది. అసలు అమీర్ పై ఇంత నెగటివిటీ పెరగడానికి కారణం ఆయన గతంలో చేసిన జాతి వ్యతిరేక వ్యాఖ్యలు అని ఒక వాదన వినిపిస్తోంది. అమీర్ తన కెరీర్‌లో ఇంతకు ముందు కూడా చాలా సార్లు జాతియ వ్యతిరేకిగా (Anti National)నిందింప బడ్డారు.

READ  అన్నదమ్ములుగా కనిపించనున్న మెగాస్టార్ - మాస్ మహరాజ్

అయితే ఈ వివాదాలు ఎప్పుడూ ఆయన సినిమాల బాక్సాఫీస్ స్టామినాను ప్రభావం చూపించలేదు అన్నది వాస్తవం. అయితే ఈసారి మాత్రం గతానికి భిన్నంగా అమీర్‌ ఖాన్‌ స్టార్ డం ప్రమాదంలో పడిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అమీర్ ఖాన్ సినిమాలు సాధారణంగా భారీ ఓపెనింగ్స్ ను సాధిస్తాయి కానీ లాల్ సింగ్ చడ్డా మాత్రం చాలా సాధారణ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద ఓపెన్ అయింది.

అయితే లాల్ సింగ్ చడ్డా సినిమా ఇలాంటి పరిస్థితిలో ఉండటానికి కేవలం అమీర్ ఖాన్ పై ఉన్న నెగటివిటీ మాత్రమే కారణం కాదని.. సినిమా ఒక పాత హాలీవుడ్ సినిమాకు రీమేక్ గా తెరకెక్కుతున్నప్పుడే ఈ చిత్రం పట్ల ప్రేక్షకులు పెదవి విరిచారు. ఇక కరోనా వల్ల సినిమా మరింత ఆలస్యం అవడం, పాటలు మరియు ట్రైలర్ ఏది కూడా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవడం వంటి కారణాల వల్లనే సినిమా పరాజయం దిశగా పయనిస్తుందని మరో బలమైన వాదన వినిపిస్తోంది. ఈ వాదనలో కూడా నిజం లేక పోలేదు. మరి తదుపరి చిత్రంతో అమీర్ ఖాన్ ఇలాంటి వివాదాలకు తావు లేకుండా ప్రేక్షకులని ఆకట్టుకుని భారీ విజయంతో తిరిగి కమ్ బ్యాక్ ఇస్తారని ఆశిద్దాం.

READ  చిరంజీవి సినిమా నుంచి తప్పుకున్న రవితేజ?

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories