Home సినిమా వార్తలు Bollywood Actor Support to Allu Arjun అల్లు అర్జున్ కి మద్దతుగా బాలీవుడ్ హీరో

Bollywood Actor Support to Allu Arjun అల్లు అర్జున్ కి మద్దతుగా బాలీవుడ్ హీరో

allu arjun varun dhavan

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద విజయం అందుకున్నారు. తాజాగా ఈ సినిమా రూ. 1000 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ సొంతం చేసుకొని నటుడిగా అల్లు అర్జున్ ఇమేజ్ ని మార్కెట్ ని మరింత పెంచింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని సుకుమార్ తీశారు.

అయితే ఈ మూవీ యొక్క ప్రీమియర్స్ లో భాగంగా డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్లో మూవీ చూసారు అల్లు అర్జున్. ఆ సమయంలో థియేటర్ లో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తేజ పరిస్థితి విషమంగా మారింది. దానితో అల్లు అర్జున్ పై సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో నేడు అల్లు అర్జున్ ని అరెస్టు చేయగా ఆయనకి 14 రోజులు రిమాండ్ అయితే కోర్టు విధించింది.

ఇక ఈ కేస్ పై తాజాగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ మాట్లాడుతూ అటువంటి సంఘటన జరగటం ఎంతో బాధాకరమని నిజానికి ఆ ఘటనలపై కేవలం ఒక నటుడిని బాధ్యుడుగా చేసి ఆ విధంగా అతనిని అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదన్నారు. మొత్తంగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ అల్లు అర్జున్ కి ఈ విధంగా సపోర్ట్ చేశారు.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version