Homeసినిమా వార్తలుBollywood Actor Support to Allu Arjun అల్లు అర్జున్ కి మద్దతుగా బాలీవుడ్ హీరో

Bollywood Actor Support to Allu Arjun అల్లు అర్జున్ కి మద్దతుగా బాలీవుడ్ హీరో

- Advertisement -

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల పుష్ప 2 మూవీ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చి పెద్ద విజయం అందుకున్నారు. తాజాగా ఈ సినిమా రూ. 1000 కోట్లకు పైగా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ సొంతం చేసుకొని నటుడిగా అల్లు అర్జున్ ఇమేజ్ ని మార్కెట్ ని మరింత పెంచింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని సుకుమార్ తీశారు.

అయితే ఈ మూవీ యొక్క ప్రీమియర్స్ లో భాగంగా డిసెంబర్ 4న హైదరాబాద్ సంధ్య థియేటర్లో మూవీ చూసారు అల్లు అర్జున్. ఆ సమయంలో థియేటర్ లో తొక్కిసలాట జరగడంతో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడు తేజ పరిస్థితి విషమంగా మారింది. దానితో అల్లు అర్జున్ పై సంధ్య థియేటర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో నేడు అల్లు అర్జున్ ని అరెస్టు చేయగా ఆయనకి 14 రోజులు రిమాండ్ అయితే కోర్టు విధించింది.

ఇక ఈ కేస్ పై తాజాగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ మాట్లాడుతూ అటువంటి సంఘటన జరగటం ఎంతో బాధాకరమని నిజానికి ఆ ఘటనలపై కేవలం ఒక నటుడిని బాధ్యుడుగా చేసి ఆ విధంగా అతనిని అరెస్ట్ చేయటం కరెక్ట్ కాదన్నారు. మొత్తంగా బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ అల్లు అర్జున్ కి ఈ విధంగా సపోర్ట్ చేశారు.

READ  Peelings: Rashmika’s Feast 'పుష్ప - 2' : పీలింగ్స్ సాంగ్ లో అదరగొట్టిన రష్మిక

Follow on Google News Follow on Whatsapp


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories