తెలుగు తో పాటు ప్రస్తుతం పలు భాషల ఆడియన్స్ అందరికీ ఓటిటి ప్లాట్ ఫామ్ లు అందుబాటులోకి వచ్చిన తరువాత ఎంటర్టైన్మెంట్ మరింతగా దొరుకుతోంది. ముఖ్యంగా పలు సినిమాలు అయితే థియేటర్స్ లో కాకుండా ఏకంగా ఓటిటి లోనే డైరెక్ట్ గా రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు పలు సిరీస్ లు కూడా అందరినీ ఆకట్టుకునే రీతిన తెరకెక్కి మంచి వ్యూస్, రేటింగ్స్ సొంతం చేసుకుంటుండడం విశేషం.
ఇక తాజాగా ఈ వీకెండ్ ఆడియన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్ లభించనుంది. ఇటీవల యంగ్ టైగర్ గ్లోబల్ ఐకాన్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ దేవర నవంబర్ 8న గ్రాండ్ గా ప్రముఖ ఓటిటి మాధ్యమం నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి రానుంది. ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ పోషిచిన ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించారు. ఇక రజినీకాంత్ హీరోగా టీజె జ్ఞానవేల్ దర్శకత్వంలో తెరకెక్కి మంచి విజయం అందుకున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ వెట్టయాన్. ఈ మూవీ కూడా అదే రోజున ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ఆడియన్స్ ముందుకి రానుంది.
అలానే వీటితో పాటు తాజాగా మలయాళంలో సూపర్ హిట్ కొట్టిన ఏ ఆర్ ఎమ్ మూవీ కూడా నవంబర్ 8న డిస్నీ హాట్ స్టార్ ఆడియన్స్ ముందుకి రానుంది. మొత్తంగా బాక్సాఫీస్ వద్ద విజయఢంకా మ్రోగించిన ఈ మూడు మూవీస్ ఓటిటిలో ఎంతమేర ఆడియన్స్ మెప్పు అందుకుంటాయో చూడాలి.