కోలీవుడ్ స్టార్ నటుడు ఇలయదళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం. ఈ మూవీ పై మొదటి నుండి విజయ్ ఫ్యాన్స్ అలానే నార్మల్ ఆడియన్సు అందరిలో మంచి అంచనాలు ఉన్నాయి.
ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ పై అర్చన కలపతి గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీకి యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా కీలక పాత్రల్లో ప్రశాంత్, ప్రభుదేవా, ప్రేమ్ జి, లైలా, స్నేహా నటించారు. ఇక నేడు గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్ లో ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీకి మంచి పాజిటివ్ టాక్ లభిస్తోంది.
ముఖ్యంగా తమిళనాడు ఆడియన్స్ పాజిటివ్ టాక్ చెప్తుండగా తెలుగు నుండి కూడా బాగానే టాక్ లభిస్తోంది. ముఖ్యంగా తమిళనాడులో దాదాపుగా అన్ని థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ మూవీ సక్సెస్ టాక్ తో విజయ్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటికే ప్రీ సేల్స్ పరంగా బాగా రాబట్టిన ది గోట్ మూవీ, ఓపెనింగ్ డే అలానే ఓవరాల్ గా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి.