Homeసినిమా వార్తలుసీక్వెల్ తో రాబోతున్న డీజే టిల్లు

సీక్వెల్ తో రాబోతున్న డీజే టిల్లు

- Advertisement -

ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ నడుస్తోంది.ఓ సినిమా వచ్చి అది హిట్ అయ్యిందంటే దానికి పక్కాగా సీక్వెల్ తయారు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. ప్రస్తుతం ప్రేక్షకులు ఉన్న మైండ్సెట్ లో ఏదో ఒక ఆసక్తికర అంశం ఉంటే తప్ప థియేటర్లకు కదలట్లేదు. అందువల్ల సీక్వెల్ అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆసక్తి చూపుతారు అని ఫిల్మ్ మేకర్స్ భావన.


ఈ ఏడాది మొదట్లో రిలీజ్ అయి యూత్ ప్రేక్షకులను ఆకట్టుకుని థియేటర్స్ వద్దసెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘డీజే టిల్లు’. ఈ చిత్రాన్ని టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ నాగ వంశీ రూపొందించారు. ఈ చిత్రంలో సిద్ధు జొన్నల గడ్డ ప్రధాన పాత్రలో నటించాడు. నేహ శెట్టి హీరోయిన్ గా నటించింది.


డీ జే టిల్లు తో బ్లాక్ బాస్ట‌ర్ హిట్టు కొట్టాడు సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ . సెకండ్ వేవ్ త‌ర్వాత బాక్సాపీస్‌ వద్ద హిట్ కొట్టిన అతి తక్కువ సినిమాల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు.హీరో సిద్ధు ఈ సినిమాలో ప‌క్కా హైద‌రాబాదీ స్టైల్‌లో కామెడీ ట‌చ్‌తో చేసిన యాక్టింగ్ యూత్ కు పిచ్చెక్కించింది. కాలేజీపిల్లలు డీజే టిల్లు సినిమాను బాగా ఆదరించారు. ముఖ్యంగా ఈ చిత్రం టైటిల్ సాంగ్ మోతమోగింది. అలాగే టిల్లు మేనరిజం కూడా ఇంకా ట్రెండ్ లోనే ఉంది. చిత్రంలో సిద్ధు చెప్పిన ‘అట్లుంటది మనతోటి’ అనే డైలాగ్ ఆడియెన్స్ లో బాగా నాటుకుపోయింది.

READ  777 చార్లీ చిత్రం చూసి కంటతడి పెట్టుకున్న కర్ణాటక ముఖ్యమంత్రి


అయితే డీజే టిల్లు ఫీవర్ తగ్గకముందే సెకండ్ పార్ట్ ను కూడా తీసుకు రావాలనే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఫ‌స్ట్ పార్ట్ తెర‌కెక్కించిన సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యానర్ లోనే సెకండ్ పార్ట్ కూడా రానుందనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే సిధ్దు అండ్ టీం స్క్రిప్టు ప‌నుల్లో బిజీ బిజీగా ఉన్నారంట. తాజాగా నాగ వంశీ కూడా అదిరిపోయే అనౌన్స్ చేశారు. ‘ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్రాంచైజీ… రౌండ్ 2 కోసం సిద్ధమవుతోంది.. ఆగస్ట్‌లో క్రేజీ అడ్వెంచర్ చిత్రీకరణ ప్రారంభమవుతుంది.’ అని అప్డేట్ అందించారు. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. ఆ ఫ్రాంచైజీ డీజే టిల్లునే అంటూ గట్టిగా ప్రచారం జరుగుతోంది. 

https://twitter.com/vamsi84/status/1540604133295935488?t=2pqtwWy5ZEB0ya5C8Azspw&s=19

Follow on Google News Follow on Whatsapp

READ  రామ్ చరణ్ - గ్లోబల్ స్టార్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories