పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో ‘ఖుషి’కి ప్రత్యేక స్థానం ఉంది. ఇది పవన్ నటించిన 7వ సినిమా కావటం మాత్రమే కాకుండా పెద్ద హిట్ అయ్యి.. ఆ సినిమాతో యూత్ లో తన క్రేజ్ ని, ఫ్యాన్ ఫాలోయింగ్ ని పెంచేసింది. పవన్ పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్, డైలాగ్స్, డ్యాన్స్, మ్యానరిజమ్స్, యాటిట్యూడ్ ప్రేక్షకులను, అభిమానులను పిచ్చెక్కించేలా చేశాయి.
ఇప్పటికీ ‘ఖుషి’ చాలా మందికి ఇష్టమైన సినిమా. టీవీలో టెలికాస్ట్ అవుతున్నా కూడా మిస్ కాకుండా చూసేస్తున్నారు. తాజాగా ఈ సినిమా రీ-రిలీజ్ రూపంలో మళ్లీ థియేటర్లలోకి రాబోతున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. మొదట్లో ఈ సినిమాను కొత్త సంవత్సరం సందర్బంగా రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా ఇప్పుడు కొత్త డేట్ కు మార్చబడింది.
తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ ఖుషి రీ రిలీజ్ భారీ స్థాయిలో జరగనుందని సమాచారం. విదేశాల్లో వీలైనన్ని ఎక్కువ చోట్ల విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అలాగే, రీ-రిలీజ్ కోసం ప్రత్యేక సందర్భాన్ని ఎంపిక చేశారు. ‘ఖుషి’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో ఏప్రిల్ 27, 2023న అంటే ఖుషి మొదట విడుదల చేసిన తేదీనే మళ్లీ విడుదల చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్, భూమిక జంటగా నటించిన ఖుషి ఒక యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. ఈ సినిమాని శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై అగ్ర నిర్మాత ఏఎం రత్నం నిర్మించారు. ఈ చిత్రానికి మణిశర్మ ఒక క్లాసిక్ ఆల్బమ్‌ని అందించారు.
ఏప్రిల్ 27, 2001న విడుదలైన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాకుండా హీరోగా పవన్ కళ్యాణ్ కెరీర్ ని మలుపు తిప్పింది. ఇటీవలే పవన్ ఫ్యాన్స్ ‘గబ్బర్ సింగ్’, ‘జల్సా’ సినిమాల స్పెషల్ షోలు వేశారు.
ఖుషి 4K అల్ట్రా HD టెక్నాలజీలో అద్భుతమైన నాణ్యతతో డిజిటల్‌లోకి మార్చబడుతుంది. ఇప్పటికే పవన్ పుట్టిన రోజు సందర్భంగా ‘ఖుషి ట్రైలర్ రీలోడెడ్’ పేరుతో ఓ స్పెషల్ ట్రైలర్ కట్ చేయగా అది వైరల్ అయిన సంగతి తెలిసిందే.