Homeసినిమా వార్తలుBheeshma Combo: బ్లాక్ బస్టర్ భీష్మ కాంబోలో మళ్లీ కొత్త సినిమా

Bheeshma Combo: బ్లాక్ బస్టర్ భీష్మ కాంబోలో మళ్లీ కొత్త సినిమా

- Advertisement -

యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన భీష్మ చిత్రం.. హీరో నితిన్ కెరీర్ లోనే భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమా చక్కని ఎంటర్టైన్మెంట్ తో ప్రేక్షకులని అలరించింది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ ముగ్గురూ మళ్లీ కొత్త సినిమా కోసం చేతులు కలపబోతున్నారని తెలుస్తోంది.

నిజానికి దర్శకుడు వెంకీ కుడుముల డీవీవీ సినిమా నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవితో ఓ కామెడీ ఎంటర్టైనర్ చేయాల్సి ఉండగా, ఈ ప్రాజెక్ట్ పురోగతి పై ఎలాంటి అప్డేట్ రాకపోవడంతో ఈ సినిమా ఆగిపోయిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి యువ దర్శకుడితో వారి అభిమాన హీరోని చూడాలన్న మెగా అభిమానుల ఆశలు నిజం కాకుండా పోయాయి.

నితిన్ చివరగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మాచర్ల నియోజికవర్గంలో కనిపించారు, ఈ చిత్రం కమర్షియల్ గా ఫెయిల్యూర్ గా నిలవడమే కాకుండా ప్రేక్షకుల మరియు విమర్శకుల నుండి కూడా తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. ఈ సినిమాతో తనకు మాస్ ఇమేజ్ వస్తుందని నితిన్ ఆశించారు కానీ దురదృష్టవశాత్తు ఆయన ప్రయత్నం విఫలం అయ్యింది.

READ  Rajamouli: మహేష్ తో చేయబోయే సినిమా పాన్ వరల్డ్ మూవీ అని కన్ఫర్మ్ చేసిన రాజమౌళి

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ చిత్రానికి దర్శకత్వం వహించిన వక్కంతం వంశీ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమా చేస్తున్నారు.

మరో వైపు రష్మిక మందన్న తాజాగా విజయ్ నటించిన వారిసు సినిమాలో హీరోయిన్ గా కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించి ఈ పొంగల్ విజేతగా నిలిచింది. నితిన్, వెంకీ కుడుముల, రష్మిక మందన్నల లక్కీ కాంబినేషన్లో మరో బ్లాక్ బస్టర్ సినిమా రావాలని ఆశిద్దాం.

Follow on Google News Follow on Whatsapp

READ  Sreeleela: నటి శ్రీలీల క్రేజ్ తో ఇతర నటీమణులు తమ రెమ్యునరేషన్స్ తగ్గించుకోవాల్సి వస్తోంది


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories