ఈ వారం బాక్స్ ఆఫీసు వద్ద ఆసక్తికరమైన పోరు జరగనుంది. నందమూరి కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రలో నటించిన “బింబిసార” సినిమా మరియు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన “సీతారామం” సినిమాలు పోటీ పడనున్నాయి.
నందమూరి కల్యాణ్ రామ్ తన కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో బింబిసార సినిమాని నిర్మించారు. త్రిగర్తలాధినేత బింబిసారుడికి నేటి కాలానికి వున్న సంబంధం ఏంటీ? .. అసలు బింబిసారుడు ఈ యుగంలో ఎలా ప్రతక్షమయ్యాడు అనే ఆసక్తికర అంశాల నేపథ్యంలో ఈ సినిమాని మల్లిడి వశిష్ట అనే కొత్త దర్శకుడు రూపొందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్ ట్రైలర్ లు ప్రేక్షకుల్లో చక్కని ఆసక్తిని కలిగించాయి.
ఇదే సినిమాతో పాటు దుల్కర్ సల్మాన్ నటించిన ‘సీతారామం’. హను రాఘవపూడి తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా బ్యానర్ పై భారీ చిత్రాల నిర్మాత సి. అశ్వనీదత్ ఈ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం టీజర్ ట్రైలర్ లను చూస్తుంటే ఒక అందమైన ప్రేమకథతో పాటు యుద్ధ నేపథ్యంలో జరిగే సినిమాగా అనిపిస్తుంది. కాగా విశాల్ చంద్రశేఖర్ అందించిన అద్భుతమైన సంగీతం ఈ సినిమాకి బాగా ప్రాచుర్యం తీసుకు వచ్చింది. ఈ సినిమాతో మృణాల్ ఠాకూర్ తెలుగు సినీ పరిశ్రమకు హీరోయిన్ గా పరిచయం అవుతున్నారు. అలాగే నేషనల్ క్రష్ రష్మిక మందన్న కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో ఇతర పాత్రల్లో సుమంత్, తరుణ్ భాస్కర్ గైతమ్ మీనన్ నటించారు.
ఈ రెండు చిత్రాలు కూడా రెండు కాలమాన పరిస్థితుల్లో సాగే కథలే కావడం విశేషం. అందుకే ప్రేక్షకుల్లో అటు బింబిసార ఇటు సీతారామం రెండు సినిమాలకు సమాన ప్రాధాన్యం ఉంటుంది. బహుశా ఆ కారణం వలనే అనుకుంటా ఈ చిత్రాలకి బిజినెస్ కూడా దాదాపు ఒకే తరహాలో జరిగింది.
ఈ రెండు చిత్రాలు ప్రపంచ వ్యాప్తంగా ప్రి రిలీజ్ బిజినెస్ 15 కోట్లకు జరుపుకున్నట్లు సమాచారం. రెండు చిత్రాల పై కూడా ప్రేక్షకులకు మంచి ఆసక్తి ఉన్నందున కాస్త మంచి టాక్ వస్తే ఆ మేరకు కలెక్షన్లు కూడా రావడం పెద్ద కష్టమేమీ కాదు. పైగా చక్కని ప్రచారం వల్ల ఆన్లైన్ బుకింగ్స్ కూడా రెండు చిత్రాలకు బాగున్నాయి.
గత మూడు నెలలుగా సరైన విజయం లేని తెలుగు సినిమా పరిశ్రమకు బింబిసార మరియు సీతారామం సినిమాలు గట్టి హిట్ లు సాధించి లాభాల బాట పట్టేలా చేస్తాయని ఆశిద్దాం.