తెలుగు టెలివిజన్ తెరపై కొన్నేళ్లుగా ఆడియన్స్ యొక్క ఆదరణ మరియు మంచి రేటింగ్స్ తో కొనసాగుతున్న రియాలిటీ షో బిగ్ బాస్. నిజానికి ఈ షో ప్రారంభం తరువాత కొన్ని విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ కూడా మెల్లగా అవన్నీ దాటుకుని ప్రస్తుత అనేకమంది ఆడియన్స్ మనసు చూరగొంది. ఇక ఇటీవల జరిగిన బిగ్ బాస్ సీజన్ 7 కూడా గ్రాండ్ గా జరుగగా అందులో పల్లవి ప్రశాంత్ విన్నర్ గా నిలిచి షీల్డ్ అందుకున్నారు.
ఇక త్వరలో సీజన్ 8 ని ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు బిగ్ బాస్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. మ్యాటర్ ఏమిటంటే, ఈ సీజన్ 8 లో ఎవరెవరు పాల్గొంటారు అనే దాని పై అందరిలో ఎంతో ఆసక్తి నెలకొని ఉంది. ఇక తాజాగా పలు సోర్స్ ల నుండి అందుతున్న సమాచారం ప్రకారం జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి, స్టాండప్ కమెడియన్ శ్యామ హరిణి, టివి నటి తేజస్విని గౌడ, అక్షిత, హారిక, యాక్టర్ సాయి కిరణ్, కుమారి ఆంటీ, జ్యోతిష్యుడు వేణు స్వామి, సోషల్ మీడియా ఇన్ఫ్లూ ఎన్సర్ కుషిత కల్లపు, బర్రెలక్క, నటి సురేఖ వాణి, అలానే వీరితో పాటు హీరో రాజ్ తరుణ్ వంటి వారు ఈ సీజన్ లో కంటెస్టెంట్స్ గా ఉండనున్నట్లు తెలుస్తోంది.
అయితే ప్రస్తుత పరిస్థితులను బట్టి రాజ్ తరుణ్ పాల్గొనే అవకాశం లేదని అంటున్నారు. ఇక ఈ షో మొత్తంగా మూడు నెలలు సాగనుండగా త్వరలో ప్రారంభ తేదీని స్టార్ మా వారు అనౌన్స్ చేయనున్నారు. అలానే హోస్ట్ వివరాలు కూడా త్వరలో తెలియనున్నాయి.