ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా పుష్ప 2 ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి ఫస్ట్ డే మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీని సుకుమార్ తెరకెక్కించారు. అల్లు అర్జున్ సూపర్ పెర్ఫార్మన్స్ ఈ మూవీలో అందరినీ ఆకట్టుకుంది. అయితే ఈ మూవీ యొక్క ప్రీమియర్ ని డిసెంబర్ 4న రాత్రి 9.30 ని. లకు చూసేందుకు హైదరాబాద్ సంధ్య థియేటర్ కు కుటుంబసమేతం వచ్చారు అల్లు అర్జున్.
ఫ్యాన్స్ తో కలిసి ఆయన హ్యాపీగా మూవీ చూసారు. అయితే అల్లు అర్జున్ సంధ్య థియేటర్ కి వస్తుండడంతో అక్కడ ఒక్కసారిగా జనసందోహం భారీగా ఏర్పడి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె కుమారుడి పరిస్థితి విషమంగా మారింది. ఆ ఘటనతో సంధ్య థియేటర్ తో పాటు అల్లు అర్జున్ పై కూడా కేసు పెట్టారు పోలీసులు. నేడు కొద్దిసేపటి క్రితం ఆ విషయమై అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి కోర్టుకు తరలించనున్నారు.
కాగా ఈ విషయమై ఒక పెద్ద ట్విస్ట్ ఇప్పుడు బయటకు వచ్చింది. నిజానికి డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ కి అల్లు అర్జున్ తో పాటు హీరోయిన్ సహా మరికొందరు వస్తున్నారని, ఆ కారణంగా ప్రత్యేకంగా పోలీసు బందోబస్తు కావాలని సంధ్య థియటర్ వారు డిసెంబర్ 2న పెట్టుకున్న అర్జీ ఇప్పుడు బయటకు వచ్చింది. దానితో ఈ కేసు విషయమై పోలీసులు, కోర్ట్ ఏ విధంగా ముందుకు సాగుతుందో అల్లు అర్జున్ కి శిక్ష పడుతుందో లేదో చూడాలి.