యువ నటుడు నితిన్ హీరోగా అందాల నటి శ్రీలీల హీరోయిన్ గా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ మూవీ రాబిన్ హుడ్. ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ గా నిర్మించగా జివి ప్రకాష్ కుమార్ సంగీతం సమకూర్చారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్, పోస్టర్స్ తో ఆకట్టుకున్న ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ వేగంగా నిర్వహిస్తోంది మూవీ యూనిట్.
నితిన్ ఇందులో ఒక దొంగ పాత్ర చేస్తుండగా ముఖ్య పాత్రలో రాజేంద్ర ప్రసాద్ కనిపించనున్నారు. మార్చి 28న రాబిన్ హుడ్ మూవీ ఆడియన్స్ ముందుకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ సమయంలో మూవీ టీమ్ కి ఊహించని బిగ్ షాక్ తగిలింది. ఇటీవల మూవీ నుండి కేతిక శర్మ పై చిత్రీకరించిన ప్రత్యేక ఐటెం సాంగ్ అదిదా సర్ప్రైజ్ లిరికల్ వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ రావడంతో పాటు ఆ సాంగ్ పై సోషల్ మీడియాలో విపరీతంగా రీల్స్ కూడా వచ్చాయి.
కాగా ఆ సాంగ్ ని సినిమా నుండి తొలగించాలని నేడు తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ రాబిన్‌హుడ్ చిత్ర బృందాన్ని కోరింది. ఆ సాంగ్ తో పాటు అందులోని స్టెప్స్ మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని వారు అంటున్నారు. మరి మహిళా కమిషన్ యొక్క ఈ అభ్యర్ధనకి రాబిన్ హుడ్ మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.