Home సినిమా వార్తలు Big Relief for yuvan shankar raja ‘ది గోట్’ : యువన్ కి బిగ్...

Big Relief for yuvan shankar raja ‘ది గోట్’ : యువన్ కి బిగ్ రిలీఫ్ 

the goat

కోలీవుడ్ స్టార్ నటుడు ఇలయదళపతి విజయ్ హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ యాక్షన్ మూవీ ది గోట్ ( ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం). అయితే ఇటీవల ఆడియన్స్ ముందుకి మంచి అంచనాలతో రిలీజ్ అయిన ఈ మూవీ బాగానే రెస్పాన్స్ తో బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. ​ఈ మూవీలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించగా ప్రశాంత్, స్నేహ, ప్రభుదేవా కీలక పాత్రలు చేసారు.

ఓవరాల్ గా ఇప్పటివరకు రూ. 400 కోట్లకు పైగా గ్రాస్ తో దూసుకెళ్తోంది ది గోట్ మూవీ. ఈ మూవీ ఏజిఎస్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ గ్రాండ్ లెవెల్లో నిర్మించగా యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు. వాస్తవానికి ఈ మూవీ యొక్క సాంగ్స్ రిలీజ్ కి ముందు అసలు ఏమాత్రం ఆకట్టుకోలేదు సరికదా ట్రైలర్ లో బీజీఎమ్ కూడా పెద్దగా అలరించలేదు. 

అయితే ది గోట్ మూవీ రిలీజ్ అనంతరం ముఖ్యంగా యువన్ శంకర్ రాజా అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. ఆల్మోస్ట్ థియేట్రికల్ రిలీజ్ పూర్తి అయ్యే ఈ సమయంలో ది గోట్ బీజీఎమ్ కి ప్రసంశలు లభిస్తుండడం సంగీత దర్శకుడు యువన్ కి రిలీఫ్ అని చెప్పాలి.

Follow on Google News Follow on Whatsapp




Show comments
Exit mobile version