Homeసినిమా వార్తలుDasara: నాని దసరాకు భారీ సంఖ్యలో సెన్సార్ కట్‌లు

Dasara: నాని దసరాకు భారీ సంఖ్యలో సెన్సార్ కట్‌లు

- Advertisement -

నాని దసరా ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతోంది మరియు ఈ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా పై ప్రేక్షకులు మరియు ట్రేడ్ వర్గాల నుండి కూడా అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు నాని కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో ఈ చిత్రం రూపొందడం విశేషం.

దసరాకు సంబంధించి తాజా వార్త ఏమిటంటే, ఈ చిత్రం సెన్సార్‌షిప్ పరీక్షను ముగించుకుంది. కాగా సెన్సార్ బోర్డ్ ఈ సినిమాకు భారీ సంఖ్యలో రకంగా 36 కట్లు చెప్పారట. ఒక సాధారణ తెలుగు చిత్రానికి ఇది ఒక విధమైన రికార్డ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక చిత్రం సెన్సార్ బోర్డ్ నుండి ఇంత పెద్ద సంఖ్యలో 36 కట్‌లు మరియు దిద్దుబాట్లను పొందటం అరుదుగా జరుగుతుంది.

దీనివల్ల దసరా రెగ్యులర్ సినిమా కాదని, సినిమాలో ప్యూర్ రా ఫ్యాక్టర్‌ నిండి ఉంటుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి పల్లెటూరు నేపథ్యంలో కాస్త పచ్చిగానే తెరకెక్కే సినిమాలలో ఇలాంటి డైలాగులు ఉండటం మామూలే మరియు ఈ సినిమాలో తిట్లు కూడా ఎక్కువగా ఉండేటట్లు కనిపిస్తుంది.

READ  Balakrishna Trolls: ఓటీటీ విడుదల తర్వాత భారీ ట్రోల్స్ అందుకుంటున్న వీర సింహారెడ్డి లోని బాలకృష్ణ యువ పాత్ర

ప్రస్తుతం నాని ఈ సినిమాని దేశవ్యాప్తంగా ప్రమోట్ చేస్తున్నారు. ఈ రోజుల్లో దక్షిణాది సినిమాల వైపు ఉత్తరాది ప్రేక్షకుల మొగ్గు చూపుతున్న నేపథ్యంలో ఈ సినిమా పాన్-ఇండియన్ బాక్సాఫీస్ సమీకరణాలు ఎలా ఉంటాయి అనేది ఆసక్తికరంగా ఉంటుంది.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన దసరా చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా, సత్యన్ సూర్యన్ ISC సినిమాటోగ్రఫీని అందించారు. ఈ చిత్రానికి ఎడిటర్‌గా నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్‌గా అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా విజయ్ చాగంటి వ్యవహరించారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.

ఈ చిత్రంలో నాని, కీర్తి సురేష్, ధీక్షిత్ శెట్టి, సముద్రఖని, జరీనా వాహబ్, సాయి కుమార్ మరియు రాజశేఖర్ అనింగి నటించారు. ఈ చిత్రాన్ని మార్చి 30న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో విడుదల చేయనున్నారు. తెలంగాణలోని రామగుండం గోదావరిఖని సమీపంలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.

Follow on Google News Follow on Whatsapp

READ  Anushka: ఎట్టకేలకు విడుదలయిన నటి అనుష్క శెట్టి కొత్త సినిమా అప్‌డేట్


- Advertisement -
RELATED ARTICLES

Trending Stories

Recent Stories